రివ్యూ: శైలజా రెడ్డి అల్లుడు.. రొటీన్ డ్రామా

Thursday, September 13th, 2018, 05:50:26 PM IST

అక్కినేని నాగ చైతన్య నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ శైలజా రెడ్డి అల్లుడు. సినిమా మొదటి నుంచే ప్రోమోలతో ట్రైలర్ తో ప్రేక్షలుకుల్లో అంచనాలను రేపింది. అందులోను మారుతి దర్శకత్వంలో తెరకెక్కడంతో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇకపోతే సినిమా నేడు విడుదలైంది. మొత్తంగా శైలజా రెడ్డి అల్లుడు మెప్పించాడా లేడా అనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం!

కథ:

అహంభావి క్యారెక్టర్ తో ఉండే తండ్రి (మురళీశర్మ) ను చూసి విసుగు చెందిన చైతు (నాగచైతన్య) పాజిటివ్ యాటిట్యూడ్ ని పెంచుకుంటాడు. తన చుట్టూ ఉండే అందరితో ఫ్రెండ్లిగా ఉంటాడు. అయితే దురదృష్టవశాత్తు అతనికి ఇగో ఉన్న అమ్మాయే నచ్చుతుంది. చూడగానే అను (అను ఇమ్మాన్యుయేల్) ప్రేమలో పడతాడు. అయితే మొత్తానికి అనును ఇంప్రెస్ చేసిన చైతు పెళ్లి చేసుకోవడానికి సిద్దపడతాడు. అయితే ఊహించని విధంగా అప్పుడే అను తల్లి శైలజారెడ్డి (రమ్యకృష్ణ) నుంచి అసలు ట్విస్ట్ ఉంటుంది. అసలు ఇంతకు శైలజ రెడ్డి ఎవరు? ఎందుకు చైతూని తన కూతురి నుంచి దూరం చేయాలనీ అనుకుంటుంది? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చైతు పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేశాడు. అసలు కుటుంబాలను మొత్తంగా ఏ విధంగా మ్యానేజ్ చేసి శైలజా రెడ్డి అల్లుడు ఏ విధంగా అయ్యాడనేది అసలు కథ.

విశ్లేషణ:

నాగచైతన్యను తెరపై ఆవిష్కరించిన విధానం అతని లుక్స్ చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలాగే చైతు పర్ఫామెన్స్ కూడా ఆకట్టుకుంది. చైతు నటనలో సరికొత్త హావభావాలు ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో అద్భుతంగా నటించాడు. ఇక అను ఇమ్మాన్యుయేల్ తన అందంతో సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అహం నిండిన క్యారెక్టర్ తో సరికొత్తగా నటించింది. ఇక రమ్య కృష్ణ పాత్ర వచ్చేసి సినిమాలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆమె పాత్రలో నటించిన విధానం ఆహాభావాలు చాలా దృడంగా ఉన్నాయి. మురళీశర్మ తన పాత్రకు న్యాయం చేశారు. ఇక కమెడియన్ పృథ్వీ కామెడీ ఈ సారి పెద్దగా పేలలేదు. డైరెక్షన్ విషయానికి వస్తే.. కథను కామెడీగా తెరకెక్కించడంలో మారుతికి ఎంతగా పట్టుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ శైలజ రెడ్డి అల్లుడితో మాత్రం అనుకున్నంతగా కామెడీ పండించలేకపోయాడు. తీసుకున్న కథలో ఎంతగానో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు తెరకెక్కించిన విధానం నిరాశపరచింది. ఫస్ట్ హాఫ్ కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమా ఫన్ గా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ విలేజ్ కి షిఫ్ట్ అయ్యేసరికి సినిమా పెద్దగా మెప్పించదు. సన్నివేశాలు ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. ఇక పాటలు తెరకెక్కించిన విధానం బావుంది.

ప్లస్ పాయింట్స్:

చైతన్య – అను ఇమ్మాన్యుయేల్ జంట

నాగచైతన్యను చూపించిన విధానం

మైనెస్ పాయింట్స్:

సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం

ఆకట్టుకొని డ్రామా

కథనం

మొత్తం మీద శైలజా రెడ్డి అల్లుడు ఒక మోడ్రన్ ఏజ్ అత్తా – అల్లుడు ఫ్యామిలీ డ్రామా అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. నాగ చైతన్య స్క్రీన్ ప్రజెన్స్ మరియు ప్రధాన జంట మధ్య కొన్ని ప్రేమ సన్నివేశాలు బాగున్నాయి. పాత్రలను సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం మరియు కథనం సరిగ్గా లేకపోవటం వలన ఈ సారి మారుతీ సినిమా నిరాశపరిచింది.

Netiap.com Rating : 2.75/ 5

Reviewed by Netiap Team

  •  
  •  
  •  
  •  

Comments