ఏపీలో జరిగిన ఎన్నికలు రద్ధు చేయాలి..! శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు

Monday, April 15th, 2019, 08:00:40 PM IST

ఏపీలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు నిజమైనవి కావని, వెంటనే వాటిని రద్దు చేయాలని మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధంగా జరిగాయని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా ఉన్నాయని ఆయన మండి పడ్డారు.

అయితే ఏపీలో మొన్న జరిగిన ఎన్నికలు ఒక పద్దతి లేకుండా జరిగాయని, ఎన్నికలకు ముందు అంతా రెడీ అయిపోయి మా ఆధీనంలో ఉన్నాయని ఎన్నికల కమీషన్ ముందునుంచే చెబుతూ వచ్చింది. కానీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు పోటాపోటీగా కోట్ల డబ్బును ఖర్చు పెడుతున్న పట్టించుకోవడంలో ఈసీ విఫలమైందని ఆరోపించారు. ఏపీ ఎన్నికలు నిర్వహించిన విధానాన్ని చూస్తుంటే ఎన్నికల కమీషన్ పూర్తిగా ఫెయిల్ అయిందని అది అందరికి అర్దమవుతుందని అన్నారు. చాలా ప్రాంతాల్లో గొడవలు, అల్లర్లు రేకెత్తాయి. వాటి మధ్యే ప్రజలు ఓటు వేయటానికి వెళ్తే ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు. ఇలా ఏ ఒక్కటి సరిగ్గా నిర్వహించలేకపోయిన ఈసీ వెంటనే ఎన్నికలను రద్ధు చేయాలని ఆయన కోరారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరిపింది. కానీ ఈ సారీ మాత్రం అది ఎక్కడా కానరాలేదని ఆయన పేర్కొన్నారు.