మంత్రి ఛాలెంజ్ స్వీకరించిన హృతిక్, సైనా నెహ్వాల్!

Wednesday, May 23rd, 2018, 03:10:17 PM IST

ప్రస్తుతం అందరూ బాడీ ఫిట్ నెస్ పై అవగాహన పెంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నగరాలలో చిన్న, పెద్ద అని తేడాలేకుండా చాలామంది రోజువారీ వ్యాయామాలు చేస్తూ తమ బాడీని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం తినే తిండిలో పోషకాలు లోపించడం, అలానే రకరకాల కాలుష్యాలవల్ల ఆరోగ్యం దెబ్బతిని కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి మనిషి ముఖ్యంగా సమయానికి తిండి, శారీరక వ్యాయామం చేయడం వల్ల సమస్యలనుండి చాలావరకు బయటపడవచ్చని డాక్టర్లు సూచిస్తున్న విషయం తెలిసిందే.

ఇక విషయంలోకి వస్తే, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ‘హం ఫిట్ తో ఇండియా ఫిట్’ పేరుతో ఒక ఛాలెంజ్ ని ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు, అలానే బాట్మింషన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఒక సవాల్ విసిరారు. ఐస్ బకెట్ ఛాలెంజ్ తరహాలో భారతీయులు అందరూ కూడా ఫిట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ ఛాలెంజ్ ఏర్పాటుచేశారట. రాథోడ్ తాను కసరత్తులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో అప్ లోడ్ చేసి, సవాలును వారు ముగ్గురికి విసిరారు. అంటే వారు కూడా రాథోడ్ వలే కసరత్తులు చేస్తూ వుండే వీడియోలను పోస్ట్ చేయాలి. అంతేకాదు వారు మరికొందరు స్నేహితులను కూడా నామినేట్ చేయాల్సివుంటుంది.

ప్రధాని నరేంద్రమోడీ ప్రజలకోసం అయన పడే నిరంతర శ్రమ, ప్రజలకు సేవ చేసేందుకు శక్తివంచన లేకుండా ముందుకు నడవడమే ఈ ఛాలెంజ్ కు స్ఫూర్తి అని రాథోడ్ అంటున్నారు. కాగా ఆయన చాలేంజ్ ను స్వీకరించిన హృతిక్ నేను ఫిట్ గా ఉండడం కోసం రోజు సైక్లింగ్ చేస్తాను, జాగింగ్ చేస్తాను, అంతే కాదు రోజు ఆఫీస్ కి సైకిల్ పై వెళతాను అని ఆయన సైకిల్ పై వెళుతున్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అలానే సైనా నెహ్వాల్ కూడా తాను చేస్తున్న కసరత్తులు తాలూకు వీడియోని పోస్ట్ చేసింది. అంతేకాక సైనా తదుపరి ఛాలెంజ్ కోసం రానా, క్రికెటర్ గంభీర్, పివి సింధులను నామినేట్ చేస్తే, హృతిక్ తన ఫ్యామిలీలో రాకేష్ రోషన్, స్నేహితులు టైగర్ ష్రాఫ్, క్రునల్ కపూర్లకు ఛాలెంజ్ విసిరాడు. ప్రస్తుతం వారు పోస్ట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి……

  •  
  •  
  •  
  •  

Comments