మళ్ళీ మెరిసిన తెలుగు తేజం సైనా నెహ్వాల్

Sunday, January 27th, 2019, 05:11:57 PM IST

మరోసారి సైనా నెహ్వాల్ తన సత్తా చాటింది. ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌-500 టోర్నమెంట్‌ విజేతగా భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ నిలిచింది.అది కూడా ఆటా పూర్తిగా ముగిసిపోకుండానే సైనా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన సైనా నెహ్వాల్. ఒక దశలో కరోలినా విజయం సాదిస్తుందని అందరు అనుకున్నారు కానీ అనుకోకుండా కరోలినా కాలికి గాయం అవడంతో, తాను ఆడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆ తరువాత కొంత ప్రాథమిక చికిత్స అనంతరం మ్యాచ్‌ తిరిగి ప్రారంభించిన కరోలినా మరో రెండు పాయింట్లు సాధించన అనంతరం మరోసారి గాయం తిరగబెట్టడంతో ఫైనల్‌ పోరు నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. దీంతో టోర్నీ నిర్వాహకులు సైనా నెహ్వాల్‌ను విజేతగా ప్రకటించారు. ఈ ఏడాది తొలి మాస్టర్స్‌ టైటిల్‌ను సైనా తన ఖాతాలో వేసుకుంది.