సైనా దూకుడు – మరో విజయం

Thursday, August 29th, 2013, 01:00:03 AM IST

Saina
హైదరాబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ విజయాల యాత్ర కంటిన్యూ అవుతోంది. ఐబీఎల్ లో బంగా బీట్స్ షట్లర్ పై మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. 21-17, 14-21, 11-8 స్కోరుతో యింగ్ తై జుపై విజయం సాధించింది. ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ క్రీడాకారిణి యింగ్ తై జు, సైనాకు గట్టి పోటీ ఇచ్చింది. మొదటి గేమ్‌లో ఆరంభంలో తై ఆధిక్యం ప్రదర్శించింది. అయితే కోలుకున్న సైనా ఆ వెంటనే చక్కటి స్మాష్‌లతో దూసుకుపోయింది. మధ్యలో తై జు రెండు సార్లు వరుసగా మూడేసి పాయింట్లు నెగ్గి చేరువగా వచ్చింది. అయితే సైనా 18-17 వద్ద వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్ సొంతం చేసుకుంది.

ఓ దశలో జులియంక్ నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనప్పటికీ సైనా వాటిని అధిగమించి జయకేతనం ఎగురవేసింది. రేపు జరిగే మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పోరుకు ఈ విజయం ఊరట నిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.