చీపురు పట్టిన సల్మాన్ ఖాన్!

Wednesday, October 22nd, 2014, 09:00:02 PM IST


భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సచ్చ్ భారత్ కార్యక్రమంలో బాలివుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ముంబైలోని కర్జాత్ ప్రాంతంలో మంగళవారం సన్నిహితులతో కలిసి చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఇక ప్యాంటు మడచి చీపురు పట్టి శుభ్రం చేసిన సల్మాన్ ఖాన్ అంతటితో ఆగకుండా గోడలకు సున్నం కూడా వేశారు. అలాగే ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలివుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈఓ చందా కొచ్చార్, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, వీడియోకాన్ అధిపతి ప్రదీప్ దూత్ తదితరులను ఆహ్వానించారు.