సీనియర్ నటుడిపై సల్మాన్ ఆగ్రహం.. పారిపోయిన నటుడు!

Sunday, May 13th, 2018, 11:28:20 AM IST

బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇటీవల జరిగిన సోనమ్ కపూర్ విందు వేడుకలో అతని ప్రవర్తన దారి తప్పడంతో సినీ సెలబ్రిటీలు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే.. రిషి కపూర్ వేడుకలో ఎక్కువగా కోపంగా ఉండడం అలాగే ఇతరులతో దురుసుగా ప్రవర్తించారు అనే దానిపై కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సల్మాన్ మరదలైన సీమ ఖాన్ తో అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలింది.

విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ ఆగ్రహంతో రిషి కపూర్ దగ్గరకు వెళ్లగా అతను అప్పటికే ఇంటికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెప్పారట. దీంతో రిషి కపూర్ సతీమణి నీతూ కపూర్ విషయం తెలుసుకొని సీమా ఖాన్ తో పర్సనల్ గా మాట్లాడి క్షమాపణలు చెప్పారట. ఈ విషయం కుటుంబ సన్నిహితుల నుంచి సోషల్ మీడియాలోకి పాకడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. రిషి కపూర్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ రిషిని పట్టించుకోలేదనే కారణంతో ఆ విధంగా ప్రవర్తించినట్లు మరికొన్ని మీడియాలలో కథనాలు వస్తున్నాయి.

Comments