వైజాగ్ ఆర్కే బీచ్ ఉద్యమానికి మొదటగా వెళుతున్న తెలుగు హీరో ఎవరో తెలుసా….?

Tuesday, January 24th, 2017, 12:54:03 PM IST

sampoo
జల్లికట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ యువకులు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి కొందరు హీరోలు మద్దతు పలికారు. అయితే ఈ ఆందోళన కార్యక్రమంలో ఎవరు పాల్గొంటారో ఇంకా తెలియలేదు. అయితే తెలంగాణ కు చెందిన హీరో సంపూర్ణేష్ బాబు ఈ ఉద్యమానికి తన మద్దతు తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ యువత మాత్రం ట్విట్టర్లో మద్దతు తెలిపితే సరిపోదని, తమిళ హీరోల్లా అందరు హీరోలు ఈ ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో సంపూర్ణేష్ బాబు తాను ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని, తనకు వైజాగ్ కి టిక్కెట్ కూడా కన్ఫర్మ్ అయిందని, 26న అందరం వైజాగ్ లో కలుద్దామని ట్వీట్ చేసాడు. ప్రత్యేక హోదాపై పవన్ నినాదాన్ని సంపూర్ణేష్ బాబు మరొకసారి ట్వీట్ చేసాడు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ యువత చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి మాత్రమే తాను మద్దతు తెలుపుతున్నానని సంపూర్ణేష్ స్పష్టం చేశారు. దీంతో ఈ ఆందోళనలకు మద్దతుగా తెలుగు సినీ పరిశ్రమ నుండి వెళ్తున్న మొదటి నటుడు సంపూర్ణేష్ బాబు కావడం విశేషం.