రెండు కాదు మూడు కాదు “నాలుగు” కెమెరాలతో “శాంసంగ్” కొత్త మొబైల్.!

Friday, October 19th, 2018, 06:50:19 PM IST

కాలం మారిపోతుంది టెక్నాలజీ కూడా రోజురోజుకి పెరిగిపోతుంది.ఒకప్పుడు నిద్ర లేచి తమకి ఇష్టమైన వారి మొహం చూడటానికి ఇష్టపడే జనాలు ఇప్పుడు నిద్ర లేచిన వెంటనే పక్కన పెట్టుకున్న వారి మొబైల్ ఫోన్ కనిపించపోతే గుండె ఆగిపోయినంత పనిగా భావిస్తున్నారు.అంతలా మానవుడి దైనందిన జీవితంలో ఒక మానుకోలేని అలవాటుగా నాటుకుపోయింది.ఇప్పుడు నడుస్తున్న రోజుల్లో ఒకదాన్ని మించిన మరో ఫోను మరిన్ని ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి.మొబైల్ ఎలా ఉన్నాసరే అందులో ముఖ్యంగా కెమెరా మీదనే ఎక్కువ జనం దృష్టి పెడుతున్నారు.ముందు ఒక్క కెమెరా తో మొదలయిన ఫోన్లు ఇప్పుడు 4 నుంచి 5 కెమెరాల సామర్ధ్యంతో వస్తున్నాయి.దీన్నిబట్టే మనం అర్ధం చేసుకోవచ్చు జనం ఫోటోలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో.ఇప్పుడు మొబైల్ ఫోన్ రంగంలో అగ్ర సంస్థ “శాంసంగ్” తాజాగా “శాంసంగ్ గెలాక్సీ ఏ 9” అనే ఒక కొత్త మొబైల్ ఫోన్ ని ప్రపంచ మార్కెట్ లోకి విడుదల చేసింది.

6.3 అంగుళాల టచ్ స్క్రీన్,ఆండ్రాయిడ్ ఓరియో,6 జీబీ మరియు 8 జీబీ ర్యాం,128 జీబీ అంతర్గత మెమోరి సామర్ధ్యంతో రాబోతుంది.ప్రపంచంలో మొట్టమొదటి సారిగా వీరు వెనుక వైపు నాలుగు కెమెరాలతో ఈ మొబైల్ తీసుకువచ్చారు.ముందు వైపు సెల్ఫీ కెమెరా24 మెగాపిక్సల్ తో వెనుక కెమెరాలు వరుసగా మొదటిది సాధారణ 24 మెగాపిక్సల్,రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ ఫోటోలను తియ్యడానికి,ఇక మిగతా రెండు కెమెరాలు 10 మరియు 5 మెగాపిక్సల్లతో 2 రెట్లు అధికంగా జూమ్ చేసుకోవాడినికి మరియు ఎక్కువ కాంతిని లోపలి తీస్కొని ఫోటోలు మరింత మెరుగ్గా రావడానికి డెప్త్ సెన్సార్ కెమెరాలు మొత్తం 4 కెమెరాలతో ఈ ఫోన్ ని విడుదల చేశారు.ఈ ఫోన్ అతి త్వరలోనే భారత మార్కెట్ లోకి తీసుకురాబోతున్నామని తెలిపారు.ఈ ఫోన్ ధర దాదాపు 50 వేలు దాటి ఉంటుందని తెలుస్తుంది.