కాంగ్రెస్ నాయకులను ఊర్లోనుండి తరిమేసారా ఎందుకు..?

Monday, May 14th, 2018, 08:39:28 AM IST

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో చేపట్టిన రైతుబందు పథకం గురించి అందరికి తెలిసిందే. అయితే దీన్ని ఆపటానికి కొన్ని రాజకీయ పార్టీలు పన్నాగాలు పన్నుతున్నాయి. ఇదే పక్షంలో రైతుబంధు పథకాన్ని ఎలాగైనా విజయవంతం కాకుండా అడ్డుకుని రాజకీయపబ్బం గడుపుకొందామని ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులకు రైతులు తల ఎత్తుకొలేని సమాధానం చెప్పారు. ప్రభుత్వం పెద్ద మనసుతో రైతులకు సేవచేస్తుంటే దీన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు పథకం మేర ఇస్తున్న చెక్కుల పంపిణీని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆ ప్రాంతం నుండి తరిమి తరిమి కొట్టారు. సంక్షేమ పథకాల అమలును అడ్డుకుంటే తగిన గుణపాఠం చెప్తామని, ఎవ్వరినీ ఒదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఈ సంఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం కేరూర్ గ్రామంలో రైతులకు రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీచేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే బాబూమోహన్ హాజరయ్యారు. దీనికి ప్రొటోకాల్ ప్రకారం స్థానిక సర్పంచ్‌ను పిలువాల్సి ఉంటుంది. దీంతో అధికారులు సర్పంచ్ మంగమ్మకు (కాంగ్రెస్) ఆహ్వానం పంపించారు. మంగమ్మతోపాటు ఆమెకు వరుసకు కొడుకులైన ఎన్‌ఎస్‌యూఐ జిల్లా సమన్వయకర్త వినయ్‌గౌడ్, సాయికార్తీక్‌గౌడ్, వారి తండ్రి అడివన్నగౌడ్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.

అన్ని విధాలా ఈ రైతుబందు పతాకాన్ని అడ్డుకునేందుకు ఇద్ఫే అసలైన సమయం అని ప్రస్తుత కాలంలో ఈ గ్రామానికి స్థానిక వీఆర్వో సరిగా పనిచేయడంలేదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సాయికార్తీక్ ఎమ్మెల్యే వద్ద గట్టిగా అరిచారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. ఇది చెక్కుల పంపిణీ కార్యక్రమమని, రైతులకు ఉపయోగపడే పనిలో రాజకీయం చేయొద్దని సూచిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే సమాధానం ఒప్పుకొని కాంగ్రెస్ నేతలకు పలువురు సర్దిచెప్పే ప్రయ త్నం చేశారు. అయినా మాటవినని వినయ్, సాయికార్తీక్, అడివన్నగౌడ్ అక్కడున్న గ్రామ రైతు సమన్వయకర్త వీరన్నగౌడ్, టీఆర్‌ఎస్ యూత్ నాయకుడు ప్రభాకర్‌పై ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో ఆగ్రహించిన స్థానిక రైతులు దాడి చేసినవారిని అక్కడి నుంచి తరిమేశారు.

మళ్లీ కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు.. గ్రామ రైతు సమన్వయకర్త వీరన్నగౌడ్‌పై చేయిచేసుకోవడంతో గ్రామస్తులు, రైతులు ఒక్కసారిగా తిరుగబడ్డారు. కాంగ్రెస్ నేతలపై దాడిచేశారు. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో జోగిపేట సీఐ తిరుపతిరాజు, వట్‌పల్లి ఎస్‌ఐ గణేశ్.. వినయ్, కార్తీక్, అడివన్నగౌడ్‌ను అదుపులోకి తీసుకుని పోలిస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు కాంగ్రెస్ నాయకులపై దుమ్మెత్తిపోశారు. నాలుగున్నరేండ్లు కావస్తున్నా గ్రామ సర్పంచ్‌గా చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందిలేదని, గ్రామంలో గెలిచి హైదరాబాద్‌లో ఉంటూ గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. గొడవ సృష్టించిన సదరు నాయకులు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ముఖ్య అనుచరులు కావడంతో ఆయన ఆదేశాలతోనే వారు ఇలాంటి పనిచేశారని పలువురు గ్రామస్తులు ఆరోపించారు. ఎమ్మెల్యే బాబూమోహన్ సైతం ఈ విషయంపై సీరియస్ అయ్యారు. ఇలాంటి పనులు ఎవరుచేసినా సహించేదిలేదని, ప్రజలే వారికి బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఇకనైనా తెలంగాణా నాయకులు ప్రజలకు ఉపయోగ పదాని ఇలాంటి చెత్త పతకాలను చేర్చి రాష్ట్రాన్ని ఇంకా సర్వ నాశనం చేయొద్దు అని హెచ్చరించారు.

  •  
  •  
  •  
  •  

Comments