మళ్లీ సానియా స్థానికతపై విమర్శలు

Friday, September 12th, 2014, 06:45:16 PM IST


యుఎస్ గ్రాండ్ స్లామ్ గెలిచిన సందర్భంగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు తెలంగాణసర్కార్ రెండోసారి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందచేసింది. నెలన్నర క్రితం సానియా మీర్జాకు తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినప్పుడు కేసీఆర్ ఆమెను ప్రోత్సహించడానికి మొదటిసారిగా కోటి రూపాయల చెక్ ను అందచేశారు. అప్పుడు టీడీపీ, బీజేపీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా అదే సీన్ మళ్లీ రిపీటవుతోంది.

తాజాగా సానియా మీర్జా స్థానికతపై మరోసారి విమర్శల వర్షం మొదలైంది. సానియా స్థానికతపై టీ-టీడీపీ నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సానియా మీర్జా అసలు తెలంగాణ మహిళ కాదని.. పాక్ మహిళ అని టీ టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. పాక్ వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె పాకిస్తాన్ జాతీయురాలు అవుతుందని వారన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించే సీఎం కేసీఆర్.. సానియా మీర్జాను ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపించారు. నెలన్నర వ్యవధిలో సానియాకు రెండోసారి కోటి రూపాయలు ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు.