సానియా మీర్జా త్వరలో తల్లి కానుంది!

Tuesday, April 24th, 2018, 03:01:00 PM IST

టెన్నిస్ సంచలన క్రీడాకారిణి సానియా మీర్జా త్వరలో తల్లి కానున్నట్లు ఇటీవల తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు ఆమె తెలియచేసారు. పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ ని 2010 లో ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతే కాక ఆమె తన ట్విట్టర్ లో తన బిడ్డ విషయమై ఒక ఫోటో కూడా పోస్ట్ చేశారు. మీర్జా మాలిక్ పేరుతో ఆమె ఆ పోస్ట్ పెట్టారు. ఒక వార్డ్ రోబ్ లో మొదట మీర్జా పేరుతో ఒక టవల్, వాటర్ బాటిల్ అలానే జెర్సీ వున్నాయి. చివరిలో మాలిక్ పేరుతో జెర్సీ , వాటర్ బాటిల్, టవల్ వున్నాయి. వీరిద్దరికి మధ్య చిన్న జెర్సీ, అలానే పాల సీసా వున్నాయి. అదే చిన్న మీర్జా మాలిక్ ది ఆమె తెలిపారు. అయితే ఇప్పటికే ఆమె తల్లి కాబోతున్నట్లు ఆమె కుటుంబ సహ్యులు కూడా ధ్రువీకరించారు. తమకు పుట్టబోయే బిడ్డకు వారు ఇంటిపేరుగా మీర్జా మాలిక్ నిర్ణయించినట్లు ఆమె ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. గత అక్టోబర్ లో మోకాలి గాయం కారణంగా ఆటకు దూరమైన సానియా ప్రస్తుతం మెల్లగా కోలుకుంటున్నారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన వెంటనే ఆమెకు పలువురు అభిమానులు అభినందనలు వెల్లువగా తెలియచేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments