చికెన్ వివాదంలో సానియా మీర్జా

Tuesday, May 22nd, 2018, 04:42:19 PM IST

టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఎవరు ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఒక చికెన్ కి సంబందించిన ప్రకటన లో ఆమె నటించడం వలన ఇప్పుడు సరికొత్త వివాదాలు క్రియేట్ అవుతున్నాయి. అడ్వర్టైజ్ మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) నిర్దారణ ముగిసినప్పటికీ సానియా పట్టించుకోకుండా యాడ్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
అసలు మ్యాటర్ లోకి వెళితే.. సదరు కంపెనీ చికెన్ తయారీలో యాంటీ బయటిక్స్ వాడుతున్నట్లు తేలింది. చట్ట వ్యతిరేఖంగా ఉత్పత్తి అవుతున్న ఆ చికెన్ పై అడ్వర్టైజ్ మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) 2014 లోనే నిర్దారణ కూడా చేసింది. ఆ విషయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా సానియా లాంటి క్రీడాకారిణి ఇలా వ్యవహరించడం సరికాదని కొందరు తప్పుబట్టారు.

  •  
  •  
  •  
  •  

Comments