కేసీఆర్ ను పెళ్ళికి ఆహ్వానించిన సానియా మీర్జా !

Monday, November 14th, 2016, 07:57:10 PM IST

sania
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రముఖ అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పెళ్ళికి ఆహ్వానించారు. హైదరాబాద్ లోని క్యాంపు ఆఫీసులో నిన్న ఆదివారం ముఖ్యమంత్రిని తండ్రితో సహా కలిసిన సానియా మీర్జా తన చెల్లెలు అనం మీర్జా పెళ్లి విషయం చెప్పి ఆహ్వాన పత్రిక అందించారు. గతంలో ఎన్నోసార్లు కేసీఆర్ సానియా మీర్జా ఆడించిమన్ విజయాలకు నగదు, ఇతర బహుమతుల రూపంలో ప్రోత్సాహకాలను అందించి ఆమెను ఎంకరేజ్ చేశారు.

అందుకే సానియా కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సందర్బంగా కుటుంబ సమేతంగా వివాహానికి రావాలని సానియా కేసీఆర్ ను కోరారు. కేసీఆర్ కూడా సానియాను ఆప్యాయంగా రిసీవ్ చేసుకుని సరదాగా ముచ్చటించారు.