చెత్తను ఊడ్చిన సానియా

Thursday, October 16th, 2014, 04:15:07 PM IST

sqania-mirza

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు పాల్గొంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ‘స్వచ్చ భారత్’ కార్యక్రమంలో పాల్గొంది. ప్రశాసన్ నగర్ లో సానియా చీపురు పట్టి చెత్తను ఊడ్చింది. నాగార్జున, సానియా మీర్జాలు స్వచ్చ భారత్ లో పాల్గొన్నాలని అనిల్ అంబానీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.

స్వచ్చ భారత్ లో పాల్గొన్న అనంతరం సానియా.. తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, షూటర్ అభినవ్ బింద్రాలకు ఈ కార్యక్రమంలో పాల్గొనలంటూ చాలెంజ్ విసిరారు.