కోటి తీసుకుంటున్నా ఆపని మాత్రం చేయలేకపోయినా సానియా..!!

Thursday, February 9th, 2017, 01:27:19 PM IST


తెలంగాణా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం ఆమెకు తెలంగాణా ప్రభుత్వం రూ కోటి ని నజరానాగా అందిస్తున్నారు. కాగా ప్రిన్సిపల్ కమిషన్ ఆఫ్ సర్వీస్ టాక్స్ విభాగం నుంచి ఆమె సమన్లు అందుకుంది. సర్వీస్ టాక్స్ ని కట్టకుండా ఆమె ఎగవేయడంతో ఆవిభాగం నుంచి ఆమె సమన్లు అందుకుంది. ఈనెల 16 న తమ ముందు విచారణకు హాజరు కావాలని సానియా ని సర్వీస్ టాక్స్ విభాగం ఆదేశించింది.

కాగా ఈ విచారణలో ఆమె తరుపున న్యాయవాది అయినా పాల్గొనవచ్చని సమన్లలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆమె రూ కోటి పొందుతోంది. ఇది కూడా సేవా వాణిజ్యం కిందవస్తుందని సర్వీస్ టాక్స్ అధికారులు అంటున్నారు.ఆమె తీసుకుంటున్న పారితోషకానికి ఏటా 15 శాతం పన్ను కట్టాల్సిందే అని అధికారులు అంటున్నారు. ఈ నెల 16 న విచారణకు హాజరు కాకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.