ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్.. సానియా మీర్జా ట్వీట్ వైరల్!

Wednesday, September 19th, 2018, 03:33:29 PM IST

ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సెలబ్రెటీల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ ఇండియా జట్టుకు మద్దతు ప్రకటిస్తున్నారు. పాకిస్తాన్ లో కూడా వారి అభిమానులు ఇండియాపై పాకిస్తాన్ విజయం సాదిస్తుందని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సమయంలో సానియా మీర్జా ఎవరికీ సపోర్ట్ చేయనున్నారు అనేది ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ మారింది. అయితే ఇది ముందే గమనించిన సానియా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి దూరంగా ఉంటున్నట్లు ఊహించని ట్వీట్ చేసింది.

మ్యాచ్‌ స్టార్ట్ అవ్వడానికి 24 గంటలు కూడా లేదు. అయితే 24 గంటల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. లేకుంటే చెత్త వాగుడు వినాల్సివస్తుంది. ఈ పరిణామం వల్ల ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా అనారోగ్యానికి గురవుతాడు. అలాంటిది ప్రెగ్నెంట్‌ అయిన నా పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అందులో భాగంగానే కొన్ని రోజుల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాను. అయితే అందరూ ఒకటి గుర్తుంచుకొండి. ఇది కేవలం క్రికెట్‌ మ్యాచ్‌ మాత్రమే’ అంటూ సానియా మీర్జా ట్వీట్ చేశారు.