శ్రీ శాంత్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సంజన.!

Wednesday, June 5th, 2013, 11:54:24 AM IST

స్వతహాగా కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సంజన తెలుగులో కూడా పలు సినిమాలు చేసి గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ శ్రీ శాంత్ కేసు సంజన మెడకి చుట్టుకోనుంది. సంజనకి శ్రీ శాంత్ కి సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా?.. గతంలో వీరిద్దరూ గోవాలో స్టెప్పులేస్తూ ఓ సారి కెమెరాలకు చిక్కారు. అప్పట్లో వారిద్దరూ ప్రేమికులని వదంతులు వినిపించినా అవన్నీ పుకార్లే అని సంజన ఖండించింది. కానీ ఈ మధ్య ఐపిఎల్ మ్యాచ్ లు ముగిసిన అనంతరం జరిగే అన్ని పార్టీలకు సంజన హాజరుకావడం అలాగే సంజనకి, శ్రీ శాంత్ కి చాలా కాలంగా పరిచయం ఉండడం, శ్రీశాంత్ కి సంజన మంచి ఆప్తురాలు కావడంతో సంజనని పోలీసులు విచారించాలనుకుంటున్నారు. ఆమెతో పాటు మరో హీరోయిన్ ని కూడా విచారించే అవకాశం ఉంది. ఈ కేసుకి సంబందించిన ఓ పోలీసు అధికారి ‘ ముంబై పోలీసులు సంజన గురించి పూర్తి వివరాలు కనుక్కున్నారు. త్వరలోనే ఆమెని విచారించడానికి సమన్లు పంపే అవకాశముందని’ ఆయన తెలిపాడు. చూస్తుంటే స్పాట్ ఫిక్సింగ్ కేసు సంజన మెడకు కూడా చుట్టుకునేలా ఉంది.