“వినయ విధేయ రామ”..ఏదో తేడా కొడుతున్నట్టుందిగా..?

Thursday, January 10th, 2019, 12:45:34 PM IST

సంక్రాంతి రేస్ లో ఇప్పటికే రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వాటి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేసాయి.ఇప్పటికి విడుదలైన రెండు సినెమాలపైనా మిశ్రమ స్పందనే సినీ ప్రేక్షకుల నుంచి వచ్చింది.అయితే ఈ రేస్ లో మాత్రం అన్ని చిత్రాల కన్నా భారీ అంచనాలతో రాబోతున్న సినిమా మాత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం “వినయ విధేయ రామ” అనే చెప్పాలి.ఇప్పటికే ఈ సినిమా పై అన్ని చోట్ల భారీగానే బిజినెస్ జరిగింది.అయితే మరి సంక్రాంతి ఎఫెక్టో లేక ఇతర కారణలో బాల కృష్ణ సినిమాకు మరియు రజిని సినిమాలకు మాత్రం ఊహించిన స్థాయిలో అయితే ముందు అడ్వాన్స్ బుకింగ్స్ అవ్వలేదు.

ఇప్పుడు ఈ ఎఫెక్ట్ చరణ్ సినిమా పై పడుతున్నట్టు కనిపిస్తుంది.అటు ఆంధ్రా వైపు బుకింగ్స్ జోరుగానే సాగుతున్నా ఇటు నైజాం వైపు మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉండనే చెప్పాలి.ఇప్పటికి విడుదలైన రెండు సినిమాల కన్నా బుకింగ్స్ ఎక్కువ స్థాయిలో అయినా సరే ఈ కాంబినేషన్ పై ఉన్న అంచనాలకు అది మాత్రం సరిపోదు.అక్కడక్కా కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ చేసినా ఎక్కువ థియేటర్లు కేటాయించడం వలనో లేక భాగ్య నగరం నుంచి అందరు సొంత ఊర్లకు వెళ్లడం వలనో టిక్కెట్లు బుక్ చేసేవాళ్ళు కరువయ్యారు.మరి రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ఇలాంటి పరిస్థితుల్లో మొదటి రోజు ఎన్నికోట్లు రాబడుతుందో వేచి చూడాలి.