ఏపీ లో ఫాథర్ డేరాబాబా.. సీరియస్ అయిన నన్నపనేని

Wednesday, October 18th, 2017, 07:12:51 PM IST

ఆడపిల్లకు ఎటువంటి ఆపద కలిగిన వెంటనే స్పందించే వారిలో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఒకరు. అయితే రీసెంట్ గా కొందరి ఆడపిల్లలకు ఆమె సపోర్ట్ గా నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా చర్చి పాస్టర్ ఎబునేజర్ గత కొంత కాలంగా యువతులను లైంగికంగా వేధిస్తున్నారని తెలుసుకున్న ఆమె ఆ విషయంపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని జగన్నాథపురంకి ఈ రోజు వెళ్లిన రాజకుమారి తాడేపల్లిగూడెం మండలం జగ్నాథపురంలో చర్చి పాస్టర్ గా ఉన్న ఎబునేజర్ పిల్లలను తల్లిదండ్రులకు వేరు చేస్తూ వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె తెలుసుకున్నారు. అంతే కాకుండా బాధిత తల్లి దండ్రులతో మాట్లాడిన ఆమె పూర్తి వివరాలను తెలుసుకొని వెంటనే చర్యలను తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలను జారీ చేశారు. అలాగే డేరా బాబా అవతారం ఎత్తిన నిందితుదీని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని కఠిన చర్యలను తీసుకుంటామని ఆమె తెలిపారు.