ఇండ‌స్ట్రీ టాక్‌ : స్టార్ కిడ్ ల‌క్కీ ఛాన్స్‌.. !?

Sunday, December 3rd, 2017, 03:15:03 AM IST

స్టార్ కిడ్స్‌ని లాంచ్ చేయ‌డంలో 100శాతం స‌క్సెస్ రేట్ ఉన్న స్టార్ ఫిలింమేక‌ర్ క‌ర‌ణ్ జోహార్‌. అందుకే అత‌డి చేతుల‌మీదుగా త‌మ వార‌సుల్ని బాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేసేందుకు టాప్ సెల‌బ్రిటీలంతా త‌హ‌త‌హ‌లాడుతుంటారు. శ్రీ‌దేవి, చుంకీ పాండే, సైఫ్ ఖాన్ అంత‌టివాళ్లు త‌మ పుత్రిక‌ల్ని క‌ర‌ణ్ చేతుల‌మీదుగానే లాంచ్ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఆ క్ర‌మంలోనే శ్రీ‌దేవి, చుంకీ పాండే వంటి స్టార్ల పుత్రికార‌త్నాల్ని క‌ర‌ణ్ లాంచ్ చేస్తున్నాడు.

అయితే సైఫ్ అలీఖాన్ – అమృత సింగ్‌ల గారాల ప‌ట్టీ సారా అలీఖాన్ మాత్రం ఆ ఛాన్స్ మిస్స‌యింది. సారాని లాంచ్ చేసేందుకు క‌ర‌ణ్ ప్ర‌య‌త్నించినా ఎందుక‌నో కుదర‌లేదు. ఈలోగానే సారా అభిషేక్ క‌పూర్ `కేదార్‌నాథ్‌` చిత్రానికి క‌మిటైంది. క‌ర‌ణ్ మ‌ల్టిపుల్ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల‌నే సారాకు ఆ ఛాన్స్ మిస్స‌యింద‌ని బాలీవుడ్‌లో క‌థ‌నాలొచ్చాయి. అయితే రీసెంటుగానే శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ లాంచింగ్ మూవీని ప్రారంభించాడు క‌ర‌ణ్‌. మ‌రాఠా చిత్రం సైరాఠ్ హిందీ రీమేక్‌ను అత‌డు తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతోనే జాన్వీ బాలీవుడ్ ఎంట్రీ ఖాయ‌మైంది. ఇటీవ‌ల రిలీజైన ఫ‌స్ట్‌లుక్‌కి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇక సారా అలీఖాన్ తొలి సినిమా సంగ‌తులు అటుంచితే, సారా న‌టించే రెండో సినిమాని క‌ర‌ణ్ లాక్ చేశాడు. ఈసారి మాత్రం ఎట్టి ప‌రిస్థితిలో సారాతో సినిమా చేసితీరాల‌ని క‌ర‌ణ్ డిసైడ్ అయ్యాడు. ఆ క్ర‌మంలోనే ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌లోనే ఈ సినిమా నిర్మించ‌నున్నాన‌ని తెలిపాడు. క‌ర‌ణ్ లాంచ్ చేసిన స్టార్ కిడ్ ఆలియాభ‌ట్ ఇప్పుడు ఎంత పెద్ద క‌థానాయిక అయ్యిందో తెలిసిందే. అంత‌కుమించి జాన్వి, సారా క‌ర‌ణ్ బ్లెస్సింగ్స్‌తో పెద్ద స్టార్లు అవుతార‌నే ఆశిద్దాం.

  •  
  •  
  •  
  •  

Comments