రూ.9కే చీర ఆఫర్ పేరుతో ఫ్లాష్ సేల్…షాప్ దగ్గర మొదలైన క్లాష్ …..ఏమైందంటే ?

Wednesday, August 8th, 2018, 02:55:43 AM IST

ఏదైనా వస్తువును అమ్మాలంటే దుకాణదారులు ప్రజలను ఆకర్షించేలా రకరకాల ఆఫర్లతో వారి ముందుకు వస్తుంటారు. కొందరైతే ఒకటి కొంటె మరొకటి ఉచితమని, మరికొందరేమో మా వద్ద ఫలానా వస్తువులు కొంటే ఇంత డిస్కౌంట్ అంత డిస్కౌంట్ అంటూ ఊదరకొట్టేస్తుంటారు. ఇంకొంతమంది అయితే మనం ఊహించనివిధంగా ఆ వస్తువును మరీ తక్కువ ధరలకు అందిస్తుంటారు. అందులో ఏమి మాయ, మర్మం ఉంటుందో నిజానికి మనకు తెలియదనుకోండి. అంటే ఈ మధ్య ఆన్ లైన్ లో కొన్ని ఈ కామర్స్ వెబ్ సైట్లు ఫ్లాష్ సేల్ అని నిర్వహిస్తూ కొన్ని వస్తువులను చాలా తక్కువ ధరలకు అందిస్తుంటాయి. అయితే ఇటువంటివి ఎప్పుడోగాని రావు. ఇక ఇటువంటిదే ఇప్ప్పుడు వరంగల్ జిల్లా హన్మకొండ మండలంలో జరిగింది. మా షాపులో చీర కేవలం రూ.9 అంటూ ఫ్లాష్ సేల్ పేరుతో విపరీతమైన ప్రకటనలతో ఊదరకొట్టిందో షాపు యాజమాన్యం.

అంతే, అలా అఫర్ గురించి ప్రకటనలు ఇచ్చారో ఇలా తెల్లవారకముందే ఆ షాప్ ముందు మహిళలు వందల్లో బారులు తీరారు. ఎంతలా అంటే దాదాపు అరకిలోమీటరు పైనే వారి క్యూ నిలిచిందంటే, ఆఫర్ కి క్రేజ్ ఎలా వచ్చిందో అర్ధమవుతోంది. ఇంతవరకు బాగున్నప్పటికీ క్యూలో చాలామంది మహిళలు తోసుకోవడం, మధ్యలో మేము ముందంటే మేము అని కలబడి గొడవలు చేయడంతో, పెద్ద గందరగోళం జరిగి వారి మధ్య క్లాష్ ఏర్పడింది. దానివల్ల ఆ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో ఒక్కసారిగా రంగప్రవేశం చేసిన పోలీసులు గొడవపడుతున్న మహిళలను అడ్డుకున్నారు. అప్పటికే ఆ వివాదంలో కొందరు మహిళలకు గాయాలవగా, వారిని జాగ్రత్త పక్కకు తీసుకువచ్చి మంచినీళ్లు ఇచ్చి పోలీసులు వారికి సపర్యలు చేయవలసి వచ్చింది. రూ.9 కే చీర సంగతీమోకాని ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా జనసందోహంతో నిండిపోవడంతో పోలీసులు అక్కడివారిని చెదరగొట్టే ప్రయత్నమ్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments