హిట్టా లేక ఫట్టా : స‌ర్కార్ – సెన్షేష‌న్ హిట్ కాంబో.. హ్యాట్రిక్ కొట్టారా..?

Tuesday, November 6th, 2018, 04:35:20 PM IST

స‌ర్కార్.. పేరుతోనే సినీ అభిమానుల్లో వైబ్రేష‌న్స్ క్రియేట్ చేశారు సెన్షేష‌న్ హిట్ కాంబో.. విజ‌య-మురుగ‌దాస్‌లు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తుపాకి, క‌త్తి చిత్రాలు సంచ‌ల‌న విజ‌యాలు సాధించ‌డంతో హ్యాట్రిక్ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో వ‌చ్చిన టీజ‌ర్, ట్రైల‌ర్లు అద‌ర‌గొట్ట‌డంతో స‌ర్కార్ పై అంచ‌నాలు ప్రేక్ష‌కుల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇక అందుకు త‌గ్గ‌ట్టే ప‌క్కా పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్, మాస్ ఎలిమెంట్స్‌, అబ్బుర‌ప‌రిచే విజువ‌ల్స్‌, స్టార్ కాస్ట్‌, బిగ్ ప్రొడ‌క్ష‌న్.. ఇవ‌న్నీ స‌ర్కార్ పై అంచ‌నాల‌ను పీక్స్ తీసుకెళ్ళాయి. ఈ నేప‌ధ్యంలో దీపావ‌ళి కానుక‌గా ఈ రోజే విడుద‌ల అయిన స‌ర్కార్ హిట్టా లేక ఫ‌ట్టా తెలుసుకుందాం.

ఇక స‌ర్కార్ విష‌యానికి వ‌స్తే త‌న ఓటు దుర్వినియోగం అవ‌డంతో.. పాలిటిక్స్‌లోకి వ‌చ్చిన‌ ఓ కార్పోరేట్ క్రిమిన‌ల్.. ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు.. అనుకోకుండా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుంద‌ర్ ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు.. ఇదే స‌ర్కార్ మెయిన్ ఫ్లాట్. స‌ర్కార్ మూల క‌థ అయితే బాగానే ఉంది. అయితే ఆ మూల క‌థ‌కి యాప్ట్ అయ్యే థ్రెడ్స్ అల్లుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యి త‌న మార్కు వేగంతో క‌థ‌నాన్ని న‌డిపించ‌డంలో డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఫస్ట్‌హాఫ్‌ యాక్షన్ సీన్స్‌, పొలిటికల్ డైలాగ్స్‌తో ఇంట్రస్టింగ్‌గా నడిపించిన మురుగదాస్‌.. సెకండ్ హాఫ్‌కు వ‌చ్చే స‌రికి సినిమాని ఆ స్థాయిలో చూపించలేకపోయాడు.

సమాజంలోని ఏదో ఒక సమస్యను వేలెత్తి చూపడమే కాక చక్కని పరిష్కారం మురుగ‌దాస్ సినిమాల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే స‌ర్కార్ చిత్రంలో కూడా ఎన్నిక‌ల్లో జ‌రుగుతున్న దొంగఓటు లాంటి స‌మ‌స్య‌ను తీసుకున్న మురుగ‌దాస్ కీల‌క‌మైన అంశాల‌ను మాత్రం ప‌ట్టించుకోలేదు. ఒక మంచి క‌థ‌ను ఎన్నుకున్న ద‌ర్శ‌కుడు ఆ క‌థ‌కి త‌గ్గ‌ట్టు సీన్లు రాసుకోకుండా.. కమర్షియల్ అంశాలు, ఫ్యాన్ మూమెంట్స్‌ను సినిమాలో ఇరికించి స‌ర్కార్‌కి లాజిక్ లేని ట్రీట్‌మెంట్ ఇచ్చాడు మురుగ‌దాస్. దీంతో స‌ర్కార్ చిత్రంలో విజయ్‌ మార్క్ మ్యాన‌రిజ‌మ్, మాస్‌ అప్పీల్, స్టైలిష్ ప‌ర్ఫామెన్స్‌తో విజ‌య ఈ స‌ర్కార్‌ని త‌న భుజాల పై మోసినా.. మురుగదాస్ నుండి ఆశించే మ్యాజిక‌ల్ మేకింగ్ క‌నిపించ‌క‌పోవ‌డంతో స‌ర్కార్ ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌నే చెప్పాలి.

ఇక‌ విజయ్, వరలక్ష్మీ పాత్రల్ని అత్యుద్భుతంగా డిజైన్ చేసుకొన్న మురుగదాస్ మిగతా పాత్రల్ని, కథనాన్ని గాలికొదిలేశాడు. అసలు కీర్తి సురేష్ పాత్ర అయితే మ‌రీ ధారుణంగా డిజైన్ చేశాడు మురుగ‌దాస్. ప్రీక్లైమాక్స్‌లో వ‌ర‌ల‌క్ష్మీ ఊస‌ర‌వెల్లిలా ఉన్న ఆమె న‌ట‌న టెర్రిఫిక్ అని చెప్పాలి. సీనియర్ ఆర్టిస్ట్ రాధారవి పాత్రం ప‌ర్వాలేద‌ని పిస్దుంది. ఇక మిగ‌తా వారి గురించి చెప్పుకోవ‌డం కూడా అన‌వ‌స‌రం.ఇక స‌ర్కార్‌కి గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ హైలెట్ అని చెప్పాలి.. రెహ‌మాన్ పాట‌లు నిరాశ‌ప‌ర్చ‌గా.. ఆర్ఆర్ కూడా పెద్ద‌గా ఇంపాక్ట్ అనిపించ‌దు. ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్ కొన్ని సీన్ల‌కు క‌త్తెర వేస్తే బాగుండేది. ఇక చివ‌రిగా చెప్పాలంటే.. ఇక హీరో బిల్డప్‌, యాక్షన్‌ సీన్స్‌లో విజయ్ ఇమేజ్‌ను ఆకాశానికి ఎత్తేసినా.. ఏ మాత్రం థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ లేకుండా.. లాజిక్ లేని స‌న్నివేశాల‌తో.. తెర‌కెక్కిన స‌ర్కార్ తెలులు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవ‌డం క‌ష్ట‌మే అని చెప్పాలి.

విజయ్ అభిమానుల‌కు మాత్ర‌మే..

Reviewed By 123telugu.com |Rating : 2.5/5

మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన్‌మెంట్..

Reviewed By timesofindia.indiatimes.com |Rating : 3/5

విసిగించే స‌ర్కార్..

Reviewed By cinejosh.com |Rating : 2.5/5