సర్కార్ మూవీ టీజర్ రివ్యూ : అత‌ను ఒక కార్పోరేట్ రాక్ష‌సుడు..!

Saturday, October 20th, 2018, 04:35:34 PM IST

త‌మిళ ఇల‌య‌ప‌తి విజ‌య్ – సెన్షేష‌న్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం స‌ర్కార్. విజయ, మురుగ‌దాస్ కాంబినేష‌న్ అంటేనే ప్రేక్ష‌కుల్లో విప‌రీతంగా భారీ అంచ‌నాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తుపాకి, క‌త్తి చిత్రాలు సంచ‌ల‌న విజ‌యాలు సాధించి కోలీవుడ్ రికార్డుల‌ను తిర‌గ‌రాసాయి. ఈ నేప‌ధ్యంలో వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న స‌ర్కార్ టీజర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. మ‌రి ఈ టీజ‌ర్ స‌ర్కార్ టీజ‌ర్ పై ఎలాంటి అంచ‌నాలు రేకెత్తించిందో తెలుసుకుందాం.

ఇక స‌ర్కార్ టీజ‌ర్ ఎలా ఉంది అంటే.. విజ‌య్ నుండి ఎలాంటి చిత్రాలను ఆశిస్తారో.. అలాంటి ఎలిమెంట్స్‌తోనే ఈ చిత్రం తెర‌కెక్కినట్టుంది. ఈ చిత్రంలో విజయ్ కార్పొరేట్ రంగంలో కింగ్ మేక‌ర్‌గా కనిపించబోతున్నారు. అందుకే అత‌ను కార్పోరేట్ రాక్ష‌సుడు అంటూ ఈ టీజ‌ర్‌లో విజ‌య్ పాత్ర‌ని ప‌రిచ‌యం చేశారు. రాజ‌కీయ నేప‌ధ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో విజ‌య్ త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైన మేన‌రిజంతో రెచ్చిపోయాడు. టీజ‌ర్‌లో చూపించిన మాస్ సాంగ్‌లో అదిరిపోయే డ్యాన్స్‌లు, వావ్ అనిపించే ఫైట్స్‌తో విజయ్ అద‌ర‌గొట్టేశాడు. హీరోయిన్ కీర్తి సురేష్ చాలా క్యూట్‌గా ఉంది. ఇక మ‌రో హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మీ మ‌రోసారి కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని తెలుస్తోంది.

స‌ర్కార్ టీజ‌ర్‌లో ముఖ్యంగా అబ్బుర పరిచే భారీ సెట్టింగులతో పాటు డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్ మేకింగ్ చాలా స్టైలిష్‌గా ఉంది. ఇక ఏఆర్ రెహ్మాన్ ఆర్ ఆర్ ఈ టీజ‌ర్‌ని మ‌రో రేంజ్‌కి తీసుకెళ్ళింద‌టే.. ఈ సినిమాలో ఎలా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఫైన‌ల్‌గా చెప్పాలంటే.. స‌ర్కార్ మూవీ ఎలా ఉండ‌బోతుందో తాజాగా విడుద‌లైన‌ టీజ‌ర్ తోనే అర్ధ‌మ‌వుతుంది. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్నస‌ర్కార్ ఈ న‌వంబ‌ర్ దీపావలి కానుక‌గా న‌వంబ‌ర్ 6న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి టీజ‌ర్‌తోనే రాకార్డులు క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం విడుద‌ల అయ్యాక ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుందో చూడాలంటే దీపావ‌ళి వ‌ర‌కు ఆగాల్సిందే. ఇక ఈ సర్కార్ టీజ‌ర్ విడుద‌ల అయిన 24 గంట‌ల‌లోపే 13 మిలియ‌న్ వ్యూస్‌తో యూట్యూబ్ ద‌ద్ద‌రిల్లేలా దూసుకుపోతుంది.