ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానన్న శశికళ

Friday, January 27th, 2017, 09:20:24 AM IST

sasikala
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టిన శశికళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రధాన కార్యదర్శి పదవిని ఆమె చేపట్టినప్పటి నుండి అన్నాడీఎంకే నాయకులు ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టాలని ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు విన్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఈ నెల 23న తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ అసెంబ్లీకి వస్తారని, వీఐపీ గ్యాలరీలో కూర్చుని సమావేశాలను తిలకిస్తారని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తో సహా అందరూ అనుకున్నారు. కానీ రాలేదు. గురువారం రిపబ్లిక్ డే వేడుకలకు కూడా శశికళ దూరంగా ఉన్నారు. ఎందుకా అని ఆ పార్టీ నేతలు ఆరా తీస్తే తాను ముఖ్యమంత్రి గానే అసెంబ్లీలో అడుగుపెడతానని, అప్పటివరకు అటువైపు కన్నెత్తి కూడా చూడనని శశికళ సీనియర్ మత్రులకు చెప్పినట్టు సమాచారం. జయలలిత బాటలోనే నడవాలని ఆమె తీర్మానించుకున్నారని అందరూ అనుకుంటున్నారు.