వారంలోగా శశికళ ప్రమాణ స్వీకారం..అయ్యేపనేనా..?

Wednesday, February 8th, 2017, 03:32:16 PM IST


పన్నీర్ సెల్వం ఒక్కసారిగా ససైక్లకు ఎదురు తిరిగిన తరువాత తమిళ రాజకీయాలను దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శశికళ , పనీర్ సెల్వంల మధ్య తలెత్తిన విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న అంశం ఆసక్తి కరంగా మారింది.తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని పన్నీర్ సెల్వం ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై చిన్నమ్మ శశికళ మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు. పన్నీర్ సెల్వం ద్రోహి అంటూ ఆరోపించారు.పన్నీర్ సెల్వం 48 గంటల్లో మాట మార్చారని ఆరోపించారు. అమ్మ మరణం తరువాత కార్యకర్తలు తననే పార్టీ పగ్గాలు చేపట్టమన్నారని కానీ బాధలో అప్పుడు కాదని పన్నీర్ కు అవకాశం ఇచ్చానని శశికళ అన్నారు. ఆమె తన బలాన్ని నిరూపించుకోవడానికి నేడు పార్టీ ఎమ్మెల్యే లతో సమావేశం అయ్యారు/. ఈ సమావేశానికి 130 మంది ఎమ్మెల్యే లు హాజరయ్యారని శశికళ అన్నారు. తనకు 130 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ప్రకటించుకున్నారు. తాను వరం రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆమె అన్నారు.

శశికళ వారం రోజుల్లోగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని ప్రకటించినా అలాంటి పరిస్థితులు లేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆమె కు సంబందించిన పలు కేసుకు కోర్టులో ఉన్నాయి. జయలలిత కు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విషయంలో సుప్రీం నాలుగైదు రోజుల్లో తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో శశికళ ఏ 2 ముద్దాయిగా ఉన్నారు. ఒకవేళ ఈ కేసులో కోర్టు శిక్ష విధిస్తే మాత్రం శశికళకు ముఖ్యమంత్రి అయ్యే వికాసం ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆమెకు ఆమె కుటుంబసభ్యులకు చెందిన కొన్ని కంపెనీలు తమిళనాడు ప్రభుత్వంతో కలసి వ్యాపారం చేస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఆమె ముఖ్యమంత్రి అయితే అధికారులు ఆమెకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. ప్రయోజనాల మధ్య వైరుధ్యం కింద శశికళను పదవి దక్కకుండా పోయి అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు.