జయ సమాధిపై ఆవేశంగా కొట్టి శపథం చేసిన శశికళ..!!

Wednesday, February 15th, 2017, 12:43:31 PM IST


శశికళ వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది. తాను లొంగిపోవడానికి నాలుగు వారాల గడువు కావాలని సుప్రీం కోర్టు లో వేసిన పిటిషన్ ని ధర్మాసనం తోసిపుచ్చింది. తాము శశికళని తక్షణం లొంగిపోవాలని ఆదేశించామని తక్షణం అన్న పదానికి అర్థం తెలియదా అని శశికళ తరుపున న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. దీనితో శశికళకు ఉన్న దారులన్నీ మూసుకు పోయాయి. కాగా ఆమె బెంగుళూరు లోని ప్రత్యేక న్యాయ స్థానం లో లొంగిపోవడానికి కాసేపటి క్రితమే బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె జయ సమాధిని సందర్శించి వెళ్లారు. జయ సమాధివద్ద ఆమె ఉద్వేగానికి గురయ్యారు. ఆవేశంగా జయ సమాధిపై అర చేతితో తట్టి శపథం చేసారు.

ఆమె ఆవేశంగా అమ్మ సమాధికి ఏదో చెప్పుకున్నారు. మూడు సార్లు అమ్మ సమాధికి మొక్కారు. ఆ సమయంలో ఆమె ముఖంలో కన్నీరు కనిపించాయి. అనంతరం ఆమె అక్కడి నుంచి తన సొంత వాహనంలో ఇళవరసి సుధాకరన్ లతో కలసి బెంగుళూరు కు బయలు దేరారు. ఈ సాయంత్రంలోగా శశికళ బెంగుళూరు కోర్టులో లొంగిపోవలసి ఉంది.

ఫోటోల కోసం క్లిక్ చేయండి