చిన్నమ్మ జాతకం 11 మంది ఎమ్మెల్యేల చేతుల్లో..!!

Sunday, February 12th, 2017, 06:30:49 PM IST


కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకుంటే చిన్నమ్మ శశికళ జాతకం తిరగబడుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.ఇప్పటికే ఆమె వర్గంలో ఈ గుబులు మొదలైందని అంటున్నారు. ఇప్పటికే వరుసగా అన్నా డీఎంకే నేతలంతా ఒక్కొక్కరుగా పన్నీర్ సెల్వం వర్గం లోకి జారుకుంటున్నారు. మరో 11 మంది ఎమ్మెల్యేలు శశికళ వర్గం నుంచి పన్నీర్ వర్గం లోకి మారితే ఆమె ముఖ్యమంత్రి కావడం కష్టమని అంటున్నారు. అన్నాడీఎంకే పార్టీ అసెంబ్లీ లో 135 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వారిలో మొదట శశికళకు మద్దత్తు తెలిపిన ఎమ్మెల్యేలు 131 అని చెబుతున్నారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో పన్నీర్ వర్గంలోకి ఆయనతో కలిపి 8 మంది ఎమ్మెల్యే లు చేరారు. మరోవైపు ఎంపీలు కూడా ఒక్కొక్కరుగా పన్నీర్ సెల్వంకే మద్దత్తు తెలుపుతున్నారు.

10 మంది ఎంపీలు మరికొందరు రాజ్యసభ సభ్యలు పన్నీర్ శిభిరంలో చేరినట్లు తెలుస్తోంది.మరో 11 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం కు మద్దత్తు తెలిపితే శశికళ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యమని అంటున్నారు.కేవలం ఆదివారం రోజు మాత్రమే పన్నీర్ ఐదుగురు ఎంపీలు పన్నీర్ శిబిరంలో చేరడం విశేషం. పన్నీర్ సెల్వం కు అంతకంతకు మద్దత్తు పెరుగుతుండడంతో ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.పన్నీర్ మద్దత్తు దారులు సంబరాలు చేస్తున్నారు. శశికళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనంటే కనీసం 117 మంది ఎమ్మెల్యే ల మద్దత్తు అవసరం. 11 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ వైపు మొగ్గు చూపితే శశికళ మ్యాజిక్ ఫిగర్ ని అందుకోవడం కష్టం అని అంటున్నారు.