ఖైదీ నెంబర్ 10711.. సాధారణ ఖైదీ గానే శశికళ..!

Wednesday, February 15th, 2017, 06:46:36 PM IST


ఇప్పటి వరకు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ నేటినుంచి సాధారణ ఖైదీ గా జైలు జీవితం గడపనున్నారు. ఈ కొద్దీ సేపటి క్రితమే ఆమె పరప్పణ అగ్రహార జైలు లోకి ప్రవేశించారు. తనని ప్రత్యేక ఖైదీ గా పరిగణించాలని ఆమె చేసుకున్న విజ్ఞప్తిని జైలు అధికారులు తోసిపుచ్చారు. కాగా శశికళను అధికారులు ఖైదీగా 10711 నెంబర్ ని కేటాయించారు. ఆమెతో పాటు ఇళవరసి కి 10712 నెంబరు ని కేటాయించారు.

కాగా సుధాకరన్ ఇంకా లొంగిపోవలసి ఉంది. శశికళ భర్త నటరాజన్, ఆమె అనుచరులు భారీగా కోర్టు జైలు వద్దకు చేరుకున్నారు. కాగా ఆదాయానికి మించిన అక్రస్థుల కేసు లో శశికళకు సుప్రీం 4 ఏళ్లపాటు శిక్ష విధించింది. ఇప్పటికే ఆమె గతంలో 6 నెలల జైలు జీవితం గడిపారు కాగా మరో మూడున్నర ఏళ్ళు శశికళ పరప్పణ అగ్రహార జైలులో సాధారణ ఖైదీ గా జైలు జీవితం గడపాల్సి ఉంది.