దిగజారిన శశికళ..రాళ్లతో కొట్టించింది..!!

Saturday, February 11th, 2017, 02:50:54 PM IST


తమిళనాట రాజకీయ వ్యవహారం తీవ్ర వివాదంగా ముదురుతోంది. శశికళ, పన్నీర్ సెల్వం లలో ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలనే విషయంపై గవర్నర్ విద్యాసాగర్ రావు రాజ్యాంగ పరమైన నిబంధనలను పరిశీలిస్తున్నారు. ఆయన న్యాయ నిపుణుల సలహాలను సైతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా శశికళ.. జయలలితకు సంబందించిన అక్రమ ఆస్తుల విషయంలో ఏ 2 ముద్దాయిగా ఉంది.త్వరలో తీర్పుకూడా వెలువడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో గవర్నర్ తీర్పు వచ్చే వరకు ఆగాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈలోపు శశికళ, పన్నీర్ సెల్వంలు ఒకరిపై ఒకరు ఎత్తులు వేసి పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. క్రమక్రమంగా పన్నీర్ సెల్వంకు అన్నా డీఎంకే నేతల మద్దత్తు పెరుగుతోంది. శశికళ రిసార్ట్ లో దాచిన ఎమ్మెల్యేలు కూడా పన్నీర్ వర్గంలో చేరిపోతున్నారని సమాచారం. పన్నీర్ కు మద్దత్తు పెరుగుతుండడంతో శశికళ రిసార్ట్ వద్ద ప్రైవేట్ సిబ్బందిచే భద్రత ని మరింత పెంచినట్లు తెలుస్తోంది. రిసార్ట్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినా మీడియా ప్రతినిధులపై రాళ్ళ దాడి సైతం చేయించిందని అంటున్నారు. కొందరు మీడియా ప్రతినిధులు రిసార్ట్ లోని ఎమ్మెల్యేల తో మాట్లాడడానికి ప్రయత్నించగా ఆమె ప్రయివేట్ సిబ్బంది మీడియా ప్రతినిధులను రాళ్లతో గాయపరిచారు. కానీ వ్యవహారం బయటకు రాకుండా శశికళ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.