జయలలిత చనిపోయే ముందు ఆ ఒక్క మాట మాత్రం చెప్పిందట !

Monday, February 13th, 2017, 11:47:27 AM IST


దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో ఉండగా ఆమె పక్కన నర్సులు కూడా పెద్దగా ఉండేవారు కాదట. ఆమె నెచ్చెలి శశికళ మాత్రం అమ్మ పక్కనే ఉండేదట.ఈ ప్రచారం ఎప్పటినుంచే జరుగుతూనే ఉంది. అపోలో ఆసుపత్రిలో ఉండగా జయ ఎవరితో అయినా మాట్లాడి ఉంటె అది శశికళతోనే మాట్లాడి ఉండాలి అని అంటున్నారు. కాగా శశికళ జయ చివరిక్షనాలో తనతో ఏం మాట్లాడారో వివరించారు. ”మన పార్టీ ని ఏ ఒక్కరూ నాశనం చేయలేరు.”ఇవే అమ్మ చివరి మాటలు. అవి తనతోనే చెప్పారని శశికళ అన్నారు.

అమ్మ చెప్పిన చివరి మాట కోసం పార్టీ ని ఎవరు నాశనం చేయాలని చూసినా ఊరుకోనని పరోక్షంగా పన్నీర్ సెల్వం ని విమర్శించారు. అన్నా డీఎంకే పార్టీ ని కాపాడేందుకు తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమని శశికళ అన్నారు.పార్టీని అమ్మ మనకు ఆస్తిగా ఇచ్చారని శశికళ అన్నారు. ఆ ఆస్తిని కాపాడాల్సిన భాద్యత మనపై ఉందని శశికళ ఎమ్మెల్యేలకు సూచించారు. అమ్మ తోపాటు, అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు తనపై బాధ్యతని ఉంచారని దానిని నెరవేర్చి తీరుతాని శశికళ అన్నారు.