చెక్కపని, బేకరీ, కిచెన్..శశికళ జైలు జీవితం ఇలా ఉండబోతోంది..!

Thursday, February 16th, 2017, 10:42:29 AM IST


శశికళ జైలు జీవితం ఎంత కఠినంగా ఉండబోతోందో తెలియడానికి ఈ మూడు పదాలు చాలు. పరప్పణ అగ్రహార జైలు ఆమె కు కొత్తకాదు. గతంలో జయలలితతో పాటు అరెస్టైనపుడు వారిని ఈ జైలుకే తరలించారు. కానీ ఆ సమయంలో జయలలిత తో పాటు శశికళ కూడా ప్రత్యేక ఖైదీ. వారికీ ప్రత్యేక సెల్, ఫ్యాన్, టివి, ఇంగ్లిష్ , తమిళ దినపత్రికలు అన్ని సౌకర్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలాకాదు.శశికళ సాధారణ జైలు జీవితం అనుభవించాల్సి ఉంది.ఆమెకు ఎటువంటి ప్రత్యేక వసతులు ఉండవు. ఆమె ఉండే సెల్ లో ఆమె తోపాటు మరో ఇద్దరు మహిళలు కూడా అందులోనే ఉంటారు. వారితోనే ఆమె సర్దుకోవాల్సి ఉంటుంది. ఉదయాన్నే ఐదు గంటలకు నిద్ర లేవాల్సి ఉంటుంది.

టాయిలెట్ల సౌకర్యం, బాత్ రూమ్ వసతి సరిగా ఉండవు. నీళ్లు కూడా సరిగా రావు. చెక్క పని, బేకరీ పని, కిచెన్.. ఈ మూడింటిలో ఆమె ఏదోఒక పనిని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనిద్వారా ఆమెకు రూ 50 కూలి కింద ఇస్తారు. కానీ నగదు కు బదులుగా ఆమె కు కూపన్లు ఇస్తారు. అలా వచ్చిన దానితోనే ఆమె తనకు అవసరమైన వాటిని జైలు లోని దుకాణాల్లో కొనుక్కోవలసి ఉంటుంది. ఖైదీలందరిలా ఆమె తెల్లటి యూనిఫామ్ ధరించాల్సి ఉంటుంది. వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది. వారానికి ఒకసారి మాంసాహారాన్ని వడ్డిస్తారు. ప్రతిరోజు భోజనంగా రాగి సంగటి ముద్ద, చపాతీ, సాంబారు వడ్డిస్తారు. తాను మధుమేహం తో భాదపడుతున్నందున తనకు ఇంటి భోజనం తినేలా అనుమతించాలని శశికళ చేసుకున్న అభ్యర్థనని న్యాయ మూర్తి తోసిపుచ్చారు. కేవలం మెడిసిన్ లు మాత్రం ఆమె వాడేలా అనుమతించారు.