చెన్నై జైలు.. చిన్నమ్మకు సీఎం కుర్చీనే..?

Tuesday, February 21st, 2017, 01:25:47 PM IST


ఎమ్మెల్యేలను ఏం మాయ చేసిందో కానీ తన వర్గం మనిషి పళని స్వామినే ముఖ్యమంత్రిని చేసి శశికళ పంథం నెగ్గించుకుంది.ఆమె జైలులో ఉన్నా పార్టీ మీద, ప్రభుత్వం మీద పూర్తి ఆధిపత్యం చలాయిస్తోందని ఇప్పటికే ప్రచారం మొదలైపోయింది. కాగా ఎప్పుడు శశికళ వర్గం మొత్తం ఆమెని చెన్నై జైలుకు బదిలీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగుళూరు జైలు లో ఉంటె ఆమె ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. అదే చెన్నై జైలులో అయితే..ముఖ్యమంత్రి తనవాడు, ప్రభుత్వం తనది కావడంతో కోర్టు ఆదేశాలు అవసరం లేకుండానే ఆమెకు అనధికారికంగా అయినా జైలులో రాజభోగాలు సమకూరుతాయి.దీనితో చిన్నమ్మని చెన్నై బదిలీ చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.

చిన్నమ్మ చెన్నై జైలుకు మారేందుకు పిటిషన్ లో మధుమేహం, మోకాళ్ళ నొప్పులను కారణాలుగా చూపుతున్నట్లు తెలుస్తోంది.ప్రతిపక్షాలు చిన్నమ్మ రాకని అడ్డుకునేందుకు ప్రతివ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. శశికళ చెన్నై వస్తే మొసలి నీటిలో ఉన్నట్లే అని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. శశికళని చెన్నై మారిస్తే తాము న్యాయ పోరాటానికి సైతం దిగుతామని బెంగుళూరు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులూ చెబుతున్నారు. మరోవైపు డీఎంకే నేత స్టాలిన్ కూడా ఈ వ్యవహారం పై న్యాయ నిపుణులు సలహాలు తీసుకుంటున్నారట. చిన్నమ్మని చెన్నై రాకుండా అడ్డుకునేందుకు ఉన్న మార్గాలన్నీ అన్వేషిస్తున్నారట. మరోవైపు పాలని స్వామి గవర్నర్ స్థాయిలో చిన్నమ్మని చెన్నై రప్పించించేందుకు సిఫార్సులను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.