ఇదేం లొల్లి: మంత్రి అయ్యేవ‌ర‌కూ గ‌డ్డం గీయ‌డ‌ట‌!

Tuesday, September 27th, 2016, 10:24:56 AM IST

sathish-reddy
జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి (టీడీపీ నేత‌ స‌తీష రెడ్డి) నెగ్గాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు కానీ.. అత‌ని డ్రీమ్ నెర‌వేర‌లేదు. జ‌గ‌న్ భారీ మెజార్టీతో నెగ్గుకొస్తుండ‌డంతో స‌తీష్ రెడ్డికి డిపాజిట్లు కూడా గ‌ల్లంత‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో చాలా కోల్పోయాడు కూడా. అయితే చంద్ర‌బాబు స‌పోర్ట్ ఉంది కాబ‌ట్టి పోటీగా బ‌రిలోకి దిగుతున్నాడు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా బాబు అత‌డికి ఎమ్మెల్సీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాడు. మంత్రి హోదాతో స‌మానంగా ఉండే మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ హోదా కూడా అత‌నికే ఇచ్చారు.

అయితే ఇప్పుడు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌కు బాబు మంత్రి ప‌ద‌వి ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. దీంతో స‌తీష్ రెడ్డి ఓ విష‌యం ప‌ట్టు విడ‌టం లేద‌ట‌. మంత్రి ప‌ద‌వి వ‌చ్చే వ‌ర‌కూ గ‌డ్డం పెంచుతూనే ఉంటా. ఆ హోదా వ‌చ్చిన‌ప్పుడు గ‌డ్డం తీసేస్తాన‌ని శ‌ప‌థం చేశాడ‌ట. కొన్ని నెల‌ల నుంచి గ‌డ్డంతోనే తిరుగుతున్నాడ‌ట‌. ఈ వ్వ‌వ‌హారాన్ని గ‌మ‌నిస్తోన్న టీడీపీ శ్రేణులు నీకు మంత్రి ప‌ద‌విస్తే ఎమ్మెల్యేలుగా ఉన్న మా ప‌రిస్థితి ఏంట‌ని అసంతృప్తి గా ఉన్నార‌ట‌. ఈ విష‌యాన్ని ముఖ్యమంత్రి వ‌ద్ద‌కు కూడా తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. అస‌లే సీమ నాయ‌కుడు మాటిచ్చాడంటే క‌ట్టుబ‌డే ఉండే క్యారెక్ట‌ర్లు. మ‌రీ స‌తీష్ రెడ్డి ఆశ‌ల‌పై పూలు చ‌ల్లుతాడో? నీళ్లు చ‌ల్లుతాడో చూడాలి.