నటన నేర్పిన గురువుకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఫీజు ఎంతో తెలుసా ?

Tuesday, November 15th, 2016, 12:33:39 AM IST

pawan-kalyan
ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. అశేష అభిమానుల్ని సంపాదించుకున్న ఆయన సైన్ కెరీర్ మొదలుపెట్టే ముందు ప్రముఖ నటనా శిక్షకుడు సత్యాంనంద్ దగ్గర శిష్యరికం చేశారు. అసలు సత్యానంద్ కు మొదటి శిష్యుడు పవన్ కళ్యాణే అట. ఈ విశేషాల్ని స్వయంగా సత్యానంద్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ను సినిమాల్లోకి తీసుకురావాలనుకొన్నప్పుడు చిరంజీవి సత్యానంద్ ను పిలిచి తమ్ముడికి నటనలో శిక్షణ ఇవ్వమని అడిగాడట.

కొన్నేళ్ల క్రితం ఒక సందర్భంలో నా నాటకంలో నటించే వారంతా కొత్తవాళ్లే వాళ్లకి నేనే స్వయంగా నటనలో శిక్షణ ఇస్తాను అని సత్యానంద్ చెప్పిన మాటను గుర్తు పెట్టుకుని చిరు పవన్ ను ఆయనకు అప్పగించాడట. అలా సత్యానంద్ పవన్ కు చెన్నైలో కొన్నాళ్ళు శిక్షణ ఇచ్చి తరివాత వైజాగ్ తీసుకొచ్చి అక్కడ కొన్నాళ్ళు శిక్షణ ఇచ్చాడట. అలా ఆయన దగ్గర శిష్యరికం చేసిన పవన్ నేడు ఉన్నత స్థానంలో ఉన్నాడు. మరి పవన్ కు నటన నేర్పిన గురువుకి చిరు ఫీజుగా లక్ష రూపాయలు ఇచ్చాడట. ఆ తరువాత పవన్ ఆయన చెల్లిలి పెళ్లికి కూడా ఆర్ధిక సహాయం చేశాడట.