రిజర్వేషన్లు రద్దు చేయాలి లేదంటే రక్తపాతమే…

Sunday, April 1st, 2018, 11:40:10 PM IST


రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర పన్నుతున్న తమ సొంత ప్రభుత్వంపైనే బీజేపీ ఎంపీ సావిత్ర బాయ్ ఫూలే తిరుగుబాటు చేశారు. ఆరక్షణ్ బచావో పేరుతో ఆమె లక్నోలోని కాన్షీరామ్ స్మృతి ఉపవన్ దగ్గర ర్యాలీ చేపట్టారు. బహ్రాయిచ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న సావిత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర జరుగుతున్నదని, తమ ప్రభుత్వం దీనిని మౌనంగా చూస్తూ ఉండిపోతున్నదని ఆరోపించారు. రిజర్వేషన్లు ఏదో భిక్షం కాదు. అది ప్రాతినిధ్యానికి సంబంధించినది. ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చి దాని ద్వారా రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తే దేశంలో కచ్చితంగా రక్తపాతం జరుగుతుంది. రిజర్వేషన్లను ఓ హక్కుగా అంబేద్కర్ మాకు ఇచ్చారు అని సావిత్రి చెప్పారు. తన ర్యాలీకి రాష్ట్రం నలుమూలల నుంచి వెనుకబడిన కులాల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చినట్లు ఆమె తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments