ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. లిమిట్స్ తగ్గించింది

Tuesday, September 26th, 2017, 02:55:42 AM IST


మోడీ నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు లేనంతగా మార్పులు చేర్పులు చేసుకున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ విషయంలో ఊహించని విధంగా కొత్త నియమాలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎప్పుడైతే పాత పెద్ద నోట్లు రద్దయ్యాయి బ్యాంకు లావాదేవీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి పెట్టింది. సక్రమమైన ట్యాక్స్ కట్టేందుకు వీలుగా అన్ని నియమాలను కొత్తగా ప్రవేశపెట్టింది.

అయితే ఈ నిర్ణయాలతో చాలా వరకు మధ్యతరగతి వాడికి కాస్త నష్టం చెందిన భవిష్యత్తు కోసమేనని తరచు మోడీ సైతం గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే వారి ఫలితాలు ముందుకు సాగుతున్నాయని ఉపయోగకారమేనని తెలుస్తోంది. మొన్నటి వరకు భారతీయ బ్యాంకుల రారాజు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కస్టమర్లకు నెలవారీ కనీస మొత్తాల నిబంధనలతో ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఉండాల్సిన మొత్తాన్ని 5000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు తగ్గించినట్లు తెలిపింది. అయితే ప్రభుత్వం నుంచి వివిధ పథకాల రూపంలో డబ్బును పొందే వారికి మినహాయిస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments