యూపీ లో ఘోరం..రోడ్డు ప్రమాదంలో 25 మంది చిన్నారులు దుర్మరణం..!

Thursday, January 19th, 2017, 11:27:41 AM IST

act
ఉత్తరప్రదేశ్ లో గురువారం ఉదయం ఘోరం జరిగింది.రోడ్డు ప్రమారం లో 25 మంది విద్యార్థులు మరణించారు. 34 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది.ఏతాహ్ జిల్లాలోని ఓ స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కుని ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.ట్రక్కుని ఢీకొన్న బస్సు పల్టీలు కొట్టి పక్కన పడింది.కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

అధికారులు, పోలీస్ లు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.కాగా ప్రమాదానికి సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీస్ లు ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.