వైరల్ వీడియో : స్కూల్ లో బాలికకు తాళి కట్టిన విద్యార్థి

Friday, January 5th, 2018, 02:00:08 PM IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో ద్వారా ఎవరు ఊహించని ఘటనలు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా బాల్య వివాహం తరహాలో ఉండే ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్కూల్ యూనిఫామ్ ధరించిన ఒక బాలిక మేడలో మరొక బాలుడు తాళి కట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బాలుడు చేతిలో తాళి పట్టుకుని ‘అమ్మా’ అంటుండగా.. ఆ వెంటనే ‘తాళి కట్టరా’ అంటూ తమిళంలో మహిళ గొంతు వినిపిస్తుంది. దీంతో బాలల సంరక్షణ సంస్థ చాలా సీరియస్ అయ్యింది. వెంటనే ఘటన ఎక్కడో జరిగిందో కనుగొనాలని పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే వీడియోలో వారు మాట్లాడుతున్న భాషను బట్టి తమిళనాడులో జరిగి ఉంటుందని అధికారులు గుర్తిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో జరిగిఉండవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక వీడియో ఎక్కడ నుంచి అప్ లోడ్ అయ్యిందో తెలుసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఘటన గురించి తెలుసుకొని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంరక్షణ సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.