చదువు చెప్తానని చెప్పి ప్రేమలేఖలు రాస్తున్న ఉపాధ్యాయుడు

Thursday, April 12th, 2018, 05:49:34 PM IST

బిడ్డల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు తన విద్యార్థినుల పైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారాలో చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విజయ్ అనే ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ బోధిస్తున్నాడు. కాగా స్కూల్లోని బాలికలకు ప్రేమలేఖలు రాస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. టీచర్ చర్యను తీవ్రంగా నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టి ఉపాధ్యాయుడిని చితకబాదారు. చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విజయ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.