ఇక ఏపీలో సీ-ప్లేన్ టూరిజం

Thursday, September 18th, 2014, 08:42:45 AM IST


ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూరాష్ట్రంలో సింగపూర్ తరహా సముద్ర విమాన టూరిజం (సీ-ప్లేన్) మరియు నీటి రవాణాలను కాకినాడ నుండి చెన్నై పోర్ట్ కు అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధిపై అధిక శ్రద్ధ పెడుతున్నట్లుగా యనమల పేర్కొన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ సీ-ప్లేన్ పర్యటనలో పర్యాటకులు సముద్రంలో కొంత సేపు గడిపి అటుపై సముద్రంపై ఇతర ప్రదేశాలకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. ఇక సముద్రంలో ప్లేన్ లాండింగ్ కి కొన్ని ప్రదేశాలను వెతుకుతున్నామని, అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి త్వరలోనే సీ-ప్లేన్ లను ఆచరణలోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు. అలాగే రవాణా కొరకు బకింహం కెనాల్ ను అభివృద్ధి చేస్తామని, నీటిపై రవాణా ఇతర మార్గాల ద్వారా చేసే రవాణా కన్నా తక్కువ వ్యయంతో జరుగుతుందని యనమల వివరించారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తుందని, అందులో ముఖ్యమైన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన పైనే ప్రధానంగా దృష్టి సారిస్తోందని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.