ఆ దూకుడు కోహ్లీలో మాత్రమే కనిపించింది!

Saturday, September 1st, 2018, 12:52:39 PM IST

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంటే కేవలం ఇండియా అభిమానులకు ఇష్టం కాదు. ప్రపంచ క్రికెట్ అభిమానులకు సైతం విరాట్ ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆట మొదలు పెట్టాడు అంటే ఆ రోజు ఎదో ఒక రికార్డు బద్దలవ్వనుందని అర్ధం చేసుకోవచ్చు. ఇక రీసెంట్ గా టెస్టుల్లో 6 వేల పరుగులు పూర్తి చేసి కొత్త మార్క్ ను అందుకున్న ఈ వీరుడు సీనియర్ క్రికెటర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. అదే విధంగా మాజీ ఛీఫ్‌ సెలెక్టర్‌ సయ్యద్‌ కిర్మానీ కూడా కోహ్లీ న్యాయకత్వ బాధ్యతలపై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం ఇండియా జట్టులో బ్యాటింగ్ విధానం చూస్తుంటే అది ఎవరికీ సాధ్యపడని ఒక విభిన్నమైన శైలి. స్పెషల్ గా కెప్టెన్ విరాట్ మరో ఆకర్షణీయమైన బ్యాటింగ్. మ్యాచ్ ను గెలిపించాలనే అతని తపన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ దూకుడు అతనికే సాధ్యం. మూడు ఫార్మాట్లలో పరిస్థితులను బట్టి మంచి ప్రదర్శనను కనబరుస్తాడు. రికార్డులు బద్దలుకొట్టే సామర్థ్యం అతినికి మాత్రమే ఉంది. నాకు తెలిసినంత వరకు విరాట్ తన రికార్డుల గురించి ఎక్కువగా ఆలోచించాడు అనుకుంటున్నా. కానీ ఏం చేయాలో ముందే సిద్ధంగా ఉంటాడు. అసలైన న్యాయకత్వ లక్షణాలు అతనిలో ఉన్నాయి. సౌరవ్ గంగూలీ తరువాత అంత దూకుడును కోహ్లీలో మాత్రమే జనాకు కనిపించింది అని సయ్యద్‌ కిర్మానీ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments