సావిత్రి సరిదిద్దుకోలేని తప్పు చేశారు: సీనియర్ నటుడు

Thursday, May 24th, 2018, 10:37:28 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా మహానటి సినిమా గురించి కొలీవూడ్ లో కూడా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. నడిగైయార్ తిలగం అనే పేరుతో అక్కడ మహానటి సినిమాను రిలీజ్ చేశారు. సావిత్రి కి అక్కడ అభిమానులు చాలానే ఉన్నారు. ఇకపోతే కొంత మంది జెమిని గణేశన్ సన్నిహితులు సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జెమిని గణేశన్ మొదటి భార్య పెద్ద కూతురు కమలా సెల్వరాజ్ తన తండ్రి సావిత్రికి మద్యం అలవాటు చేశారనేది అబద్దం అని సినిమాలో తప్పుగా చూపించినట్లు చెప్పారు.

అలాగే తమిళ సీనియర్ నటుడు జెమిని గణేశన్ సన్నిహితుడైన రాజేష్ కూడా అదే తరహాలో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. జెమినీ గణేశన్ కు ముందు పెళ్లి అయినట్లు తెలిసినా కూడా సావిత్రి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆమె పొరపాటని చెప్పారు. అదే విధంగా జెమిని గణేశన్ ఒక మద్యం అలవాటు చేసి ఉంటే అలా కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఆమె మద్యాన్ని వ్యసనంగా మార్చుకున్నారు. జెమిని గణేశన్ ఎలా ఉంటారు అనే విషయం తెలిసి కూడా సావిత్రి ఆయనకు దగ్గరవ్వడం ఆమె చేసిన అతిపెద్ద తప్పని తన మనస్తత్వానికి సరిపడని వ్యక్తిని సావిత్రి వివాహం చేసుకోవడం సరిదిద్దుకోలేని తప్పని రాజేష్ తెలుపడం సౌత్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments