సీనియర్ నటీమణి కన్నుమూత.. చివరి నిమిషంలో కూడా పిల్లలు రాలేదు!

Saturday, May 26th, 2018, 07:20:36 PM IST

బాలీవుడ్ సీనియర్ నటీమణి గీత కపూర్ మరణం అందరిని షాక్ కి గురి చేసింది. 1972 లో వచ్చిన పాకీజా అనే సినిమా ద్వారా ఆమె ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆమె శనివారం ఉదయం తుది శ్వాసను విడిచారు. కొన్ని రోజుల క్రితం వరకు బాగానే ఉన్నా ఆమె ఊహించని విధంగా అస్వస్థతకు గురి కావడంతో ఇటీవల ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకుంటుందని అనుకున్నప్పటికీ ఆమె ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మరణించినట్లు ముంబయిలోని ఎస్‌ఆర్‌వీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

బాలీవుడ్ లో దాదాపు 100 కు పైగా సినిమాల్లో నటించిన గీతా కపూర్ కి ఒక కొడుకు కూతురు ఉన్నారు. కూతురు పూజ ఎయిర్‌హోస్టస్‌గా పని చేస్తుండగా కుమారుడు రాజా బిజినెస్ చేస్తుంటాడు. అయితే గత ఏడాది క్రితమే రాజా తల్లిని విడిచిపెట్టాడు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షిణించగా సీబీఎఫ్‌సీ సభ్యుడు, నిర్మాత అశోక్‌ పండిత్‌ గీతా కపూర్ పరిస్థితి గురించి తెలుసుకొని ఆమె సంరక్షణను చూసుకున్నారు. అలాగే దర్శకుడు రమేశ్‌ ఆసుపత్రి బిల్లులు చెల్లిస్తూ అండగా నిలిచారు. చివరి నిమిషం వరకు ఆమె తన పిల్లల్ని చూడలని అనుకున్నప్పటికీ ఎవరు రాలేదు. గత వారం విందు ఏర్పాటు చేసినప్పటికీ ఆమె పైకి బాగానే ఉన్నా కూడా లోలోపల తెలియని బాధ దాచుకొని బాధపడిందని అశోక్‌ పండిత్‌ తెలియజేశారు. గీతా కపూర్ మరణవార్త విని పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments