సొంత గూటికి డీఎస్..?

Wednesday, September 5th, 2018, 08:47:01 AM IST

తెలంగాణలో రాజకీయాల్లో చాలా రోజుల తరువాత ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీఆరెస్ పార్టీలో నేతల మధ్య విబేధాలు రావడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు నేతలు టీఆరెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారా? అనే అనుమానం నెలకొంది.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిజమని అనిపిస్తోంది. ఎందుకంటే టీఆర్ఎస్‌లో చేరి ఆయన అవమానాల పాలవుతున్న సంగతి తెలిసిందే. పార్టీ నుంచి బహిష్కరించాలని సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. అయితే డీఎస్ మాత్రం టీఆరెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసేవరకు తాను తప్పుకొను అని గట్టిగా చెప్పేశారు. ప్రస్తుతం అధిష్టానం ఈ సమస్యపై చర్చలు జరుపుతోంది. దాదాపు డీఎస్ పార్టీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ లోనే మళ్ళీ చేరాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కూడా సీనియర్ నాయకుడు వస్తున్నారు అంటే నో చెప్పే చాన్స్ కనిపించడం లేదు. మొత్తంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అసలైన వార్ మొదలవ్వనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments