ఎవరికెన్ని సీట్లో లెక్క తేలింది !

Thursday, October 25th, 2018, 02:00:48 AM IST

ఇన్నాళ్లు అనేక సందేహాలకు, ఊహాగానాలకు, విమర్శలకు తావిస్తూ వచ్చిన మహాకూటమి సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. 100 స్థానాల్లో పోటీ చేయాలనే కాంగ్రెస్ కాస్త పట్టు విడవటం, మిత్ర పక్షాలు టీడీపీ,తెజస, సీపీఐలు కూడ సర్దుకోవడంతో సీట్ల కేటాయింపులో ఒక స్పష్టత ఏర్పడింది.

తాజా సమాచారం మేరకు కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీ చేయనుండగా టీడీపీ 15 స్థానాల్లో, తెజస 10 స్థానాల్లో, సీపీఐ 4 స్థానాల్లో పోటీ చేయనుంది. టిఆర్ఎస్ ఓటమి, బీజేపీ కి తమ సత్తాను చాటాలనే ఉద్దేశ్యంతో అన్ని పార్టీలు ఐక్యతతో వ్యవహరించి సీట్లు పంచుకున్నాయి. ఆయా పార్టీల పెద్దలు సైతం అసంతృప్తులు ఉన్నా అందరూ కూటమి గెలుపుకు కృషి చేస్తారని, గెలుపే ప్రధాన లక్ష్యంగా సీట్ల కేటాయింపు జరిగిందని అంటున్నారు.

ఇకపోతే అభర్ధుల జాబితాను కూడ విడివిడిగా కాకుండా ఒకే వేదికపై అన్ని పార్టీలు కలిసి ఒకసారి ప్రకటించనున్నాయి. ఈ సీట్ల పంపకం ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం మాత్రమే కాదని రాబోయే లోక్ సభ ఎలక్షన్లను కూడ దృష్టిలో పెట్టుకుని జరిగిందని కూటమి నేతలు చెబుతున్నారు.