కేజీహెచ్ ఆసుపత్రి…బయటకి రోగాలు నయం కానీ లోపల మాత్రం..?

Thursday, September 13th, 2018, 03:00:44 PM IST

ఇరుతెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఏది అంటే టక్కుమని గుర్తొచ్చే ఆసుపత్రి విశాఖలో ఉన్న “కింగ్ జార్జి ఆసుపత్రి”. బ్రిటిషు కాలం నాడు కట్టించిన ఈ ఆసుపత్రికి ఏ ఆసుపత్రికి లేనటువంటి చరిత్ర ఉంది.నగరంలో లేదా చుట్టూ పక్కల ఏ ఊళ్లల్లో పెద్ద సమస్య వచ్చినా సరే ఈ ఆసుపత్రి లోనే వైద్యం చేస్తే నయం అవుతుంది అని ఒక నమ్మకం. అయితే ఇప్పుడు ఆ నమ్మకాన్ని ప్రజలు కోల్పోతున్నారా..? అక్కడ వైద్యం అంటే మళ్ళీ బతుకుతామా..? అన్న సందిగ్ధం లోకి వెళ్లిపోతున్నారు..

దీనికి కారణం బయటకి కనిపించని లోపల కొంత మంది దురాలోచన గల వైద్యులు ప్రయివేట్ ఫార్మా కంపెనీలతో చేతులు కలిపి “క్లినికల్ ట్రయిల్” అనే పేరుతో వారు ఈ ఆస్పత్రిలోని వైద్యం చేయించుకోడానికి వస్తున్న బాధితుల పైన వారి విష ప్రయోగాలతో వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.దీనికి గాను ఆ రోగిని కానీ వారి బంధువుల దగ్గర ముందుగా అనుమతి తీసుకోవాలి కానీ వారు అలా ఏం తీసుకోకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనితో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇలాంటి వైద్యులు కోట్ల రూపాయలకు కక్కుర్తి పడి అమాయకపు ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారు.

కేజీహెచ్ లో దాదాపు 20వరకు ప్రయోగశాలలు ఉన్నాయి అని, వాటిలో అసలు ఎలాంటి ప్రమాణాలు కూడా పాటించకుండా కొత్త మందుల ప్రయోగాలు జరుగుతున్నాయి అని అంటున్నారు.వైద్యం నిమిత్తం వచ్చిన ఒక గర్భిణీ మీద మరియు టీ.బి వ్యాధితో బాధపడుతున్న మరో వ్యక్తి మీద చేసిన ప్రయోగాలతో ఈ గుట్టు అంతా బయట పడింది. ప్రయోగంలో ప్రాణాలు విడిచిన రోగుల యొక్క పోస్టు మార్టం రిపోర్టులను కూడా వారు బయటకి రానివ్వట్లేదు అని తెలుస్తుంది.. కొంత మంది మోసపూరిత వైద్యుల వల్ల ఎన్నో దశాబ్దాల పాటు ఉన్న నమ్మకాన్ని కేజీహెచ్ ఆసుపత్రి మీదున్న నమ్మకాన్ని ప్రజలు కోల్పోవాల్సి వస్తుంది.ఇక మీదటి నుంచి అయినా ప్రజలు అప్రమత్తం గా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments