టాప్ స్టోరి : ఇదే మెగాస్టార్ రోల్స్ రాయిస్‌..

Sunday, February 18th, 2018, 01:50:59 AM IST

మెర్సిడెస్ బెంజ్ రొటీన్‌.. రోల్స్ రాయిస్ సంథింగ్ స్పెష‌ల్‌. ఈ బ్రాండ్ ప్ర‌పంచంలో అతి కొద్ది మంది మాత్ర‌మే సొంతం చేసుకోగ‌ల‌రు. రోల్స్ రాయిస్ కార్ సొంతం చేసుకోవాలంటే అందుకు త‌గ్గ రేంజ్‌, సొసైటీలో స్టాట‌స్ త‌ప్ప‌నిస‌రి. ఆ కోవ‌లో చూస్తే టాలీవుడ్‌లో రోల్స్ రాయిస్ సొంతం చేసుకున్న సెల‌బ్రిటీలుగా మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌భాస్ పేర్లు మార్మోగిపోతున్నాయి.

మెగాస్టార్‌కి ఖ‌రీదైన రోల్స్ రాయిస్ కార్‌ని చ‌ర‌ణ్ కానుక‌గా ఇచ్చారు. ఇదివ‌ర‌కూ మెగాస్టార్ పుట్టిన‌రోజు వేళ త‌న పారితోషికం వెచ్చించి ఈ కార్ కొని డాడ్‌కి కానుక‌గానిచ్చారు. ఇదిగో జూబ్లీహిల్స్ లోని మెగాస్టార్ ఇంటి ఆవ‌ర‌ణ‌లో పార్క్ చేసి ఉందీ కార్‌. అంతేకాదు మెగాస్టార్ – రామ్‌చ‌ర‌ణ్ కార్ గ్యారేజ్ నిండా బోలెడ‌న్ని కార్లు ఉన్నాయి. ప్ర‌స్తుతం మెగాస్టార్ రోల్స్ రాయిస్‌తో పాటు బెంజ్ కార్‌ను ఉప‌యోగిస్తున్నారు. చ‌ర‌ణ్ ఆస్టిన్ మార్టిన్ కార్‌ని రైడ్‌కి ఉప‌యోగిస్తారు. రోల్స్ రాయిస్ కాస్ట్ రేంజ్ అందులో వేరియెంట్‌ని బ‌ట్టి 4కోట్లు- 8 కోట్లు ఉంటుంది. చిరంజీవి, అమితాబ్‌, ప్ర‌భాస్‌, ధ‌నుష్ వంటి కొంద‌రికి మాత్ర‌మే ఇది సొంతం. ఇటీవ‌లే స‌క‌ల సౌక‌ర్యాల‌తో అధునాత‌న సాంకేతిక‌త‌తో 84 కోట్ల ఖ‌రీదు ఉన్న కొత్త రోల్స్ రాయిస్ కార్‌ని మార్కెట్లోకి తెచ్చారు. దీనిని ఇప్ప‌ట్లో మ‌న‌వాళ్లెవ‌రూ సొంతం చేసుకోలేరు..