రోడ్డు ఊడుస్తుండగా దొరికిన రూ.30లక్షల బ్యాగు….. మ్యాటర్ ఏంటంటే..?

Tuesday, August 7th, 2018, 03:16:32 PM IST

మనం నిత్యం మన పనుల్లో మునిగి ఒక్కోసారి అనుకోకుండా వస్తువులు మరియు డబ్బులు చేజార్చుకుంటుంటాం. ఒకవేళ అవి చిన్నపాటివి అయితే పెద్దగా లెక్కచేయనవసరం లేదు. అదే ఒకవేళ పెద్ద మొత్తంలో నగదో, లేక ఎంతో విలువైన వస్తువులో అయితే మాత్రం మన గుండె ఒక్కసారిగా గుభేలు మంటుంది. ఇక అది దొరికే వరకు మన మనసు మన మాట వినదు. ఇలానే నిన్న హైదరాబాద్ నగరంలో ఏకంగా ఒక మహిళ రూ.30 పోగొట్టుకుంది. ఇక మ్యాటర్ ఏంటంటే హైదేరాబద్ నల్లకుంట ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లేందుకు తన కుమార్తెతో కలిసి నల్లకుంటలోని తన ఇంటివద్ద బయల్దేరి గోపాలపట్నంలో ఆటో ఎక్కింది. ఇక సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్ళి చూసుకోగా తాను తీసుకొచ్చిన ఐదు బ్యాగుల్లో ఒక బ్యాగు మాయమవడం, అది కూడా రూ.30 లక్షలు దాచిన బ్యాగు మాయమవడంతో, ఒక్కసారిగా కంగారుపడ్డ మహిళ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నల్లకుంట ప్రాంతం నుండి సికింద్రాబాద్ స్టేషన్ వరకు గల 42 సిసి కెమెరాలను ఒక్కొక్కటి పరిశీలించగా గొపపట్నం చుట్టుప్రక్కల ప్రాంతాన్ని ఆమె ఎక్కిన ఆటో దాటుతుండగా అనుకోకుండా ఒక బ్యాగ్ కిందపడిపోవడం సిసిటివిలో కనపడింది. కొద్దిసేపటికి అక్కడకు ఒక వ్యక్తి వచ్చి ఏమితెలియనట్లు బ్యాగు తీసుకుని ఉడాయించాడు.

ఇక పోలీసులు అతడు వేసుకున్న రేడియం జాకెట్ ను బట్టి అతడు ఒక జీహెచ్ఎంసీ కార్మికుడు అని తెలుసుకుని మునిసిపల్ ఆఫీస్ లో ఎంక్వయిరీ చేయగా, ఆ సమయంలో ఆ ప్రాంతంలో విధులు నిర్వహించేది రాములు(40) అనే వ్యక్తి అని చెప్పారు. రాములు వివరాలు తెలుసుకుని అతడి వద్దకు వెళ్లి విచారించిన పోలీసులకు అతడు మొదట తనకు ఏమి తెలియదని అబద్దం చెప్పాడు. ఆ తరువాత గట్టిగా నిలదీయడంతో, ఆ బ్యాగు తనకే దొరికిందని, అయితే అందులో రూ.1.59 లక్షలు తన బంధువుల వద్ద దాచానని, కొంత తన భార్య మందులకు, మరికొంత తన జల్సాలకు ఖర్చు చేసినట్లు తెలిపాడు. తరువాత నిందితుడి వద్దనుండి రూ.28,40,300 నగదును రికవరి చేసుకుని అతడిని పట్టుకుని జైలులో పెట్టారు. కాగా అతడు డబ్బులు దాచమని ఇచ్చిన అతడి బావమరిది మరియు కుమారుడు ఇద్దరూ కూడా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుని ఆ నగదును కూడా రికవరీ చేస్తామని చెప్పారు. కాగా ఘటనను ఇంతత్వరగా ఛేదించి తన నగదును తనకు ఇప్పించినందుకు ఆ మహిళ పోలీసులకు ధన్యవాదాలు చెప్పింది….

  •  
  •  
  •  
  •  

Comments