ఆ బౌలర్ ను చూసి భయపడ్డాను: సెహ్వాగ్

Thursday, October 12th, 2017, 10:27:35 AM IST

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా డాషింగ్ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ క్రికెట్ తో సంబంధాన్ని ఏ మాత్రం తెంచుకోవడం లేదు. ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అప్పట్లో గ్రౌండ్ లో అతను బ్యాట్ తో బంతిని సునాయాసంగా బౌండరీ తరలించేవారు. ముఖ్యంగా మొదటి బాల్ బౌండరీ వెళ్లాల్సిందే అన్నట్లు సెహ్వాగ్ ఆడేవాడు. కేవలం అతను గ్రౌండ్ లో ఉంటే చాలు అనుకునే అభిమానులు ఎంతో మంది అయన ఆటను చూసి చాలా ఆనందపడే వారు.

ప్రముఖ విదేశీ అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా సెహ్వాగ్ బ్యాటింగ్ కి పెద్ద ఫ్యాన్స్. ఎటువంటి బౌలర్ ని అయినా సెహ్వాగ్ ఎదుర్కునే వాడు. అతను బెస్ట్ బౌలర్ అంటే చాలు సెహ్వాగ్ ఆ బౌలర్ కే చుక్కలు చూపించేవాడు. కానీ ఒక్క బౌలర్ కి మాత్రం సెహ్వాగ్ చాలా బయపడ్డాడట. అతనే శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. అతని బౌలింగ్ చాలా బయపెట్టేది. అంతే కాకుండా అతని ముఖ కవళికలు నన్ను ఒత్తిడికి గురిచేసేవి. ఒక్కోసారి అవుట్ అయిపోతానేమో అనిపించేదని సెహ్వాగ్ వివరించాడు.